Sudhanva Sankirtanam

by Lakshmi Valli Devi Bijibilla

supported by
/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $9 USD  or more

     

1.
Ma Manasamu 03:39
మామానసము పల్లవి : మామానసము, బృందావనము మాపాలకుడు, ఆ గోపాలుడే "2" చరణం: మానస తోటలో కల్మషమను కలుపును తొలగించు మానస చోరుడు బేధములు మాపి, భావము తోడనే బంధములు పెనవేయు భాగవతోత్తముడు మంచి మనసులను, విత్తనములను నాటి గెలచి, నిలచినవాడు, గోకులనందనుడు, గోవిందుడు"మా" చరణం: బేధ భావమ్ములు విడనాడేనట ఒక త్రాటిన చేర్చిన మహీపాలుడు భవ బంధమ్ములు విడిపించేనట అవతారమూర్తీ, ఘనతార కీర్తీ బేధరహితుడు, భూతభావనుడు వాడు గరుడారూఢు, ఘనశ్యాముడు,గోవిందుడు గోపాలుడే "మా"
2.
Maa Padamulu 03:30
మా పదములు పల్లవి : మా పదములు, మా పలుకులు నీ వరకే, నీ కొరకే "2" అ.ప : మాగమనము, మాగమ్యము నీవరకే, చేరువకే "మా పదములు" చరణం : మా చలనము, చేతనము నీ కొరకే, నీవరకే "2" మా ఆరంభం, అంతిమము నీ వరకే, చేరువకే "మా పదములు" చరణం : మా స్పందన, బంధనము నీ కొరకే, నీ వరకే "2" మా జీవనము, జీవితము నీ కొరకే నీవరకే "మా పదములు" "2" చరణం : మా భావన, ప్రేరణమూ నీకొరకే, నీవరకే "2" నీఆదరము, సాదరము కావవి, మితమనంతము "మా పదములు" "2"
3.
Maa Thalli 04:31
మాతల్లి అలమేలుమంగ పల్లవి : మా తల్లి అలమేలు మంగ శ్రీ పతి సరసన, నువు నడయాడంగ "2" చరణం : వన భ్రమరమ్ములు, నల్లని కురులు ముగ్ధ సోయగపు, ముసిముసి నగవులు "2" పచ్చల హారములు, పీతాంబరము "2" మణిమయ హారముల, చందన గంధి "మా తల్లి" "2" చరణం : పలుకుల సొలపులు, మృదు మధురమ్ములు ప్రాత: కాలపు, కోయిల స్వరములు "2" పసిడి మువ్వల, సరి సవ్వడులు "2" సంధ్యా రాగపు సరిగమల ఝురులతో "మా తల్లి" చరణం : వేంకట రమణుని , పట్టపు రాణివి హృదయమునందునవెలసిన, ఘన అలివేణివి "2" సకల ప్రసాదిని, సద్గుణ వర్షిణి "2" వైకుంఠుని ప్రియ గారాల భరణివి "మా తల్లి"
4.
Madhuram 04:51
మధురం మధురం పల్లవి : మధురం, మధురం, వదనం, మధురం మధురాధిపతే, సకలం మధురం [2] చరణం : మృదుమధురం,వేణుగానం గోపవనితం, సమ్మోహమోహనం మధురాధిపతే, గానలోలం [మధురం] పరాక్రమ, శౌర్యం, రణ పుంగవం అఖిలలోకం, సుఖజీవనం మధురాధిపతే, ఆర్తరక్షకం [మధురం] చరణం : సన్నిహితత్వం,మిత్రబృందం వరదాభయం, ఆర్తపరాయణం మధురాధిపతే, అభయహస్తం [మధురం] అభయ ప్రదాతం, కల్పవృక్షం శ్రీనివాసం, ఆనంద నగం మధురాధిపతే, లీలామానుషం [మధురం] చరణం : బాల్యమిత్రం, వరప్రదాతం అష్టైశ్వర్యం, ఆజన్మాంతం మధురాధిపతే, కామధేనుం [మధురం] భగవద్గీతం, మూలపురుషం గీతాసారం, భగవత్ రూపం మధురాధిపతే, కర్మ యోగం [మధురం] చరణం : అవతార రూపం, ఆంతర్యార్ధం అవసానదశం, కృష్ణ చరణం మధురాధిపతే, జన్మ ముక్తం [మధురం] భువన త్రయం, వందనీయం దేవకి నందం, కృష్ణ దేవం మధురాధిపతే, మధురాతి మధురం [మధురం]
5.
Mahimalu 03:11
మహిమలు తెలుపగ పల్లవి : మహిమలు తెలుపగ, ఎంతటివారము, మేమెంతటివారం మహీధరుని వర్ణింపగ ఎంతటివారం, మేమేపాటివారం "2" చరణం : ఎన్ని జన్మల పుణ్య ఫలమో "2" యింతటి కారుణ్య సంపద దొరిగెను ఏ జన్మ వాసన ఫలితమో ఈ పాటిదయను బడసితిమి "మహిమలు" చరణం : పాపులకైనను పరమ దయాళువు "2" పాపులను సైతము, కరుణించు దైవము పాప కర్మలను శమియించు దైవము "2" పాపులనైననూ, పరమపుణ్యులసేయును "మహిమలు"
6.
మకుటాయమానం పల్లవి : మకుటాయమానం, మహిలోనగము శ్రితపారిజాతమ్, శ్రీ వేంకటేశమ్ చరణం : అల్లంతదూరాన, సప్తగిరులలో కొలువైనస్వామి, పిలచిన పలికేవు "2" మోకాలిపర్వత, అంచులు చేరంగ "2" సాక్షాత్కారము, నీదివ్యరూపము "మకుటా" చరణం : రాయిలో, రాగములు పలుకును స్వామీ మోదులు పచ్చగా చిగురించేనులే! నీదయవుంటే, ఎండమావైనను "2" చల్లనిమారుతము, మా చల్లని స్వామీ "మకుటా"
7.
మంచీ చెడులతో పల్లవి : మంచీ చెడులతో, మనును జీవనము కాలగమనమున, అవియునుమారేను అ.ప : హరి తలపే, మన నిజమగు ధనము ఎంత తలచిన అది, అంత పెరిగేను [మంచీ] చరణం : కన నీకు మిగుల మంచి యనునది చేదుగ దోచేను, అదియే నాకు పలువురకు మేలు సేయునన్నదే మంచియని తోచవలె, నీకును, నాకును మంచీ చెడుల తర్కము వ్యర్ధము కాలసమయములు, మరలుట కష్టము అల మాధవుని, సేవించుటనున్న, సుఖము అన్నిటను, మించినది ఓరన్న [2] [మంచీ] చరణం : కాలమాన స్థితిగతులు మారినను మంచియె నిలచును, కలకాలము మహిమలు ఎన్నో, సృష్టి చేతలో నగధరుని స్మరణే నిలువగ మనలో మంచీ చెడుల, వివరణ కష్టము అచ్యుతసేవనమే, సులభమార్గము ఏలచింత యిలలోన ఇక మనకు కొలచిన మేలగు ఓరన్నా [మంచీ]
8.
మంగళం జయ మంగళం పల్లవి : మంగళం, జయమంగళం మాఉరగశయనకుమంగళం అ.ప : మంగళం శుభ మంగళం శ్రీదురిత దూరికి మంగళం [2] చరణం : రక్కసులను, మట్టు గరిపెడి, నందకమునకు మంగళం గొల్లతల్లుల, మనము లందలి, పిల్ల గ్రోవికి మంగళం మంగళం శుభ మంగళం గోపాలబాలుకు మంగళం [మంగళం] [2] చరణం : కాళీయుని దర్పమణచిన వనజవిభునకు మంగళం ఎల్లవేళల, కన్నుకాచే కోమలాంగుకు మంగళం మంగళం శుభ మంగళం గోవర్ధనునకూ మంగళం [మంగళం] [2] చరణం : సర్వనిలయుడు, మోహనాంగుడు పరమయోగికి మంగళం క్షీరమధనుని మానసమ్మున వీక్షణమునకు మంగళం [2] మంగళం శుభ మంగళం మాపద్మనాభుకు మంగళం [మంగళం] [2]
9.
మంగళమనరే పల్లవి : మంగళ మనరే ముదితలారా జయ మంగళ మనరే "2" అ.ప : మంగళ కరునకు వందన మనరే మంగళ రూపుకు చందనమిడరే "2" మంగళం, మంగళం, జయ మంగళం "మంగళం" "2" చరణం : మంగళమనరే, చెంగల్వరాయకు, మంగళమనరే మంగళమనరే, భూతాత్మకునకు, మంగళమనరే కులుకుల కలికికి, మంగళమనరే ప్రియపాలకునకు మంగళమనరే "2" మంగళం, మంగళం, శుభమంగళం "మంగళం" "2" చరణం : మంగళమనరే, లోకవిభునకు, మంగళమనరే మంగళమనరే, విశ్వ వ్యాపునకు, మంగళమనరే అసురాంతకునకు, మంగళమనరే యుగ పురుషునకు మంగళమనరే "2" మంగళం, మంగళం, శుభ మంగళం "2"
10.
మరుక్షణమున పల్లవి : మరుక్షణమున ఏమి జరుగునో! లక్షణుని తలచుట నీ లక్షణమని తలచు "మరు" చరణం : పసిప్రాయముననె, నీ మనస్సున నిలుపు నీ అసువుల, తుదివరకు, ఆ నందుని కొలచు "2" క్షణము గడచిన కాలమంతయు వ్యర్ధమగునుగా ఈనిరీక్షణలో, ఈ చంచలమనస్సు నిరర్ధకమగును "మరు" చరణం: మహనీయులు, మహితాత్ములు, ఇలలోన నగధరుని కరుణను బడయగా, వేత్తురు, తుదివరకు వేంకటరమణుని, దివ్యకరుణను, ఇలలో పొందుటకు మానవమాత్రులము, మనజన్మలుఅదిపొందగజాలునా! "మరు"
11.
మాతయశోద పల్లవి : మాత యశోద, ముద్దుల బిడ్డడు మాయాసురులను, దునుమక మరలడు, “2” అ.ప : దుష్టులపాలి సింహ స్వప్నము శిష్టుల కన్నుల పున్నమి చంద్రుడు "మాత" చరణం : శకటాసురుని దన్నిన పదములు నొప్పిగొనినవా! చక్కని స్వామీ పూతన, ప్రాణములు హరియించిన నీనోరు, నొప్పిగొనినదా! స్వామి నవనీతము, నోరార భుజియించి సేదతీరుమా! పన్నగ శయనా "2" దుష్ట కంసుని హత మార్చిన నీ చిన్ని కరములు కందినవా!? దీనుల కభయము లీయగ, కరములు కల్యాణ కారకమవునుగా "మాత" చరణం : యశోదమ్మ నిను రోటను గట్టగ నడుము మిగులగ, నొచ్చినదా! స్వామి! కుబేర పుత్రులు, వృక్షరూపుల శాపము బాపిన పురుష పుంగవా! "స్వామీ" ముల్లొకములూ పాలించెడివాడు వైకుంఠిని సరి దైవమె లేడు "2" అల దైవముకును, యిల సైతం, మరి, భాదలు, గాధలు తప్పినవా!? అయిన నాతడు, చలించక జగతిని రక్షించి, కాపాడునుగా! "మాత"
12.
Meluko 06:21
మేలుకో, మేలుకో పల్లవి : మేలుకో, మేలుకో, మేటి రాయా మమ్మేలగా, కోనేటిరాయా [2] చరణం : తిమిర సంహారుని కిరణ స్పర్శతో మేల్కొనె, జగములు, పుడమి పులకించె [2] పుష్ప జాతులు ఎల్ల, నీ సేవ కొరకై స్వామి [2] ఆనందవూయలలు, వూగు చున్నవి,స్వామి [మేలుకో] [2] చరణం : అలరు ప్రాణేశ్వరి, సురేంద్రాదులు భక్త సముదాయములు, ఎదురు తెన్నులతో [2] వేచియున్నవి, స్వామి, నీచరణసేవకై [2] దయచూపగరావ, వేగిరమె, గోవింద [మేలుకో] [2] చరణం : అఖిల జగములు, నీ కరుణ వీక్షణముల వేచియున్నవి, ఓపన్నగశయనా! [2] యదుకుల తిలకా! నీగోష్టి యందున [2] తరంగములెల్ల, ముదమాయెనుర, తండ్రీ [మేలుకో] [2]
13.
Naanatiki 03:37
నానాటికీ ఏనాటికీ పల్లవి : నానాటికీ, ఏనాటికీ తిరమగు దైవము శ్రీధరుడొక్కడే తిరమగు దైవము శ్రీధరుడొక్కడే "నానాటికీ" చరణం : నాలుకల తేనెలూరు పదము పరమపదమునకు, ఇది మార్గము హరినామము, శ్రీహరినామము "2" ఇది నిజము, ఇక హరియే మన పధము "2" శ్రీహరితప్ప, అన్య దైవమే లేడట "నానాటికీ" చరణం : నాడును, నేడును, పుట్టుకలేని నిధియు,నిధానము, చేరువ దైవము హరి ఒక్కడే, శ్రీహరి ఒక్కడే "2" జగమంతయును, స్థితిలయలందునను "2" సృష్టియె తానుగ, వెలుగును ఏనాడు "నానాటికీ"
14.
Naarayana 05:45
నారాయణ శ్రీ మన్నారాయణ పల్లవి : నారాయణ, శ్రీమన్నారాయణ [2] నారద ప్రియనే, నారాయణ [2] అ.ప : నారాయణ, లక్ష్మీనారాయణ [2] [నారాయణ] చరణం : దేవకి నందన, భవభయభంజన ఆత్మానందా, గోవిందా [2] పరమాత్మనే, శ్రీపంకజనాభ కరుణామూర్తి, జై గోవిందా [2] నారాయణ] చరణం : దురిత విమోచన ,సిరిపాలక ప్రియ పాహిమురారే, గోవిందా [2] ఆశ్రితవత్సల, ఆపద్బాంధవ అభయ ప్రదాతా, జై గోవిందా [2] [నారాయణ] చరణం : త్రేతాయుగమున, సాకేత రామా ద్వాపరమందున, గోపాలా [2] కలియుగమందున, వేంకటరాయా అవనిని, కాయు జై గోవిందా [2][నారాయణ]
15.
Nadhude 03:44
నాధుడె జగన్నాధుడే పల్లవి : నాధుడె, జగన్నాధుడే జగతికంతయు, ఈతడె ఆధారభూతుడు నాధుడె, జగన్నాధుడీతడు "2" చరణం : పదునాల్గు భువనములు, పాలించు ఱేడు పది అవతారములు, దాల్చినవాడు "2" దిగ, దిగంతములు, తానైన వాడు దీన జనులకు దిక్కైనవాడు "నాధుడె" చరణం : ఆర్తపరాయణుడు, శ్రీ ప్రియ వల్లభుడు ఆర్తుల పాలిటి ఆపద్భాందవుడు "2" జనార్ధనుడు, జగములకే విభుడు జగదోద్ధారకుడు, జగన్నివాసుడు "నాధుడె"
16.
నామమాత్రుడ పల్లవి : నామ మాత్రుడ నేను, నామాంకితుడవు, నీవు, హరీ! "2" అ.ప : మధురామృతము బ్రోలు నీ నామామృతము గ్రోలగ, మా జన్మ ధన్యము "నామ" చరణం : అనుకూల, ప్రతికూల సమయమందునను, స్వామీ! ఎంచక మానవ తప్పిదములను "2" అసామాన్య, కరుణను కురిపించి మమ్ముల గాచిన, ఆది దైవమా! "నామ" చరణం : తలచిన వారలకు, తలచిన విధములుగ వరముల నందించు, పురుషొత్తముడవు నీవు తరతరాలకు లోటిడని దైవము "2" భక్తులముంగిట నోముల పంటా! "నామ"
17.
నమో, కేశవాచ్యుతా! పల్లవి : నమో, కేశవాచ్యుతా నమో! నారసింహా నమో! పుండరీక వరద నమో! పరమపురుషా "నమో" చరణం : లోకము లెల్లను ఏలగ లోకనాధుండీతడు "2" మకరము బారిన బడి శరణు జొచ్చిన కరిని "2" వరదవై, కరుణ జూపి కాపాడిన ఏలికా "నమో" చరణం : సరసిజ నయనుడె మనలను సర్వ విధమ్ముల గాచును "2" లోకాభిరాముడై, శోకములను బాపేను "2" సకల సుఖమ్ముల కీతడు సాక్షిభూతుడై నిలచు "నమో"
18.
నారాయణా, నారాయణా పల్లవి : నారాయణా, నారాయణా నీనామమెమాగతి, నారాయణా! "నారా" చరణం : నామస్మరణము, ముక్తిపధము "2" నామామృతము, గ్రోలగ మధురము "నారా" నామమాత్రుడను, నీ సేవ కొరకై "2" ఏమని సేవలు అందింతునూ "నారా" చరణం : పరమపదమునకు మార్గము యిదియే "2" పరమాత్మునిజేర త్రోవయె యిదియే "నారా" పరమేతానై, మనల నడిపించు "2" యిహపరములకు తావైన ఘనుడు
19.
Navadurga 04:01
నవదుర్గవుగారావమ్మా పల్లవి : నవ దుర్గవుగా రావమ్మా నవ నిధులను కురిపించమ్మా "2" నవ్య కాంతులతో వెలుగొందే "2" నటరాజ రాణీ నీవమ్మా "నవ" చరణం : కైలాస నగముల రాణివిలే కైలాసుని ప్రియ సతి వేలే కామిత ఫలములు దీరునులే కామాక్షీ! నిను గొలువగనే కర్కసులను, నువు దండించి కనకరాసులను కురిపించితివి కన్యకగా నీవు, విలసిల్లి కాత్యాయనిగా వెలసితివమ్మా దామోదరునకు సోదరివే దుండగులకు నువు, సింహస్వప్నమె దక్షుని తనయగ జనియించి దాక్షాయణిగా వెలసితివమ్మా "నవ" చరణం : సంతాన భాగ్యమును కలిగించే సంతాన లక్ష్మివి నీవేలే! సత్వరముగ మా గృహములకు సంతసమున వేంచేయగ రా! రావే సుందరేశునీ కామినిగా మధురలోన నువు వెలిశావమ్మా! సుందర సుమముల పూజించి మందహాసముల మ్రొక్కెదమమ్మా! ఆదిలక్ష్మిగ నువు మమ్ములకు ధనరాసులనే గుప్పితివమ్మా! "నవ"
20.
Neelalitha 06:26
నీ లలిత చరణములు పల్లవి : నీలలిత చరణములు పోలిన మృదుపాద కమలమ్ములు [2] చరణం : గౌగలించెడు వేళ సతి సిరినీ సుమహారములె! మరినీకరములు [2] దనుజుల దునిమెడి వేళలందున అవిమారునులె! ఉక్కు సంకెలగ [నీలలిత] చరణం : గోళాంతరాళాధిపతిగ నీవు కానవచ్చేవు, యోగి బృందములకు [2] వనమాలిగా నీవు కానవచ్చేవులే బృందావనమున, గోపెమ్మగన్నుల [నీలలిత] చరణం : కానవచ్చేవు! ప్రణయ రూపునిగ చేపట్టెడి వేళల, కన్యక రుక్మిణిని భక్తవరదగ, కానవచ్చేవులే [2] కరిప్రాణమ్ములు రక్షించువేళల [నీలలిత] చరణం : చతుర్భుజములతొ, శంఖ,చక్ర ధరుడై కానవచ్చెనులె! చిన్మయరూపునిగ నాభిన, చతురాననుని సృష్టించిన, నిను గొలుతురే, ప్రభూ! పద్మనాభునిగ [నీ లలిత]
21.
Neelimeghapu 07:06
నీలిమేఘపుఛాయ పల్లవి : నీలిమేఘపుఛాయనీలోత్పలుడు నీలిఆకసమంతా అడుగైనఱేడు [2] అ.ప: నందగోకులమున నేరేడుపండు నందబాలుడెవాడు నారాయణుడు [నీలి] చరణం: తెల్లనిఛాయగల క్షీరసాగరమున కర్పూరపుపండు కమలనాధుడెవాడు [2] పీతాంబరములొ కాంతులీనెడువాడు దామోదరుడు దేశిమామిడిపండు [నీలి] చరణం : ముత్యపుబారుల పలువరుసవాడు నొక్కుకేశముల పసిపనసయెవాడు [2] సిరిని వక్షమున నిలిపిన ఱేడు భూసురపక్షమున నిలిచినవాడు [నీలి] చరణం : విశ్వమంతటయున్న ముంతమామిడిపండు మధురామృతతొనల కమలాఫలమెవాడు [2] బ్రహ్మను నాభిన సృష్టించిన ఫలము బ్రహ్మండములలోన నారికేళమేవాడు [నీలి] చరణం : అన్నిఫలములలోనూ యున్నదితానే మిన్నఫలములనే అందించునుతానే [2] పదునాల్గుభువనముల పగడమైవెలుగొందు పదసోపానమున పుష్యరాగమైనాడు [నీలి]
22.
నీ పదముల జేర పల్లవి : నీ పదముల జేర, ముదమాయె నీవేళ [2] అ.ప : తిరుమలవాసా! శ్రీ శ్రీనివాసా [నీ పదముల] చరణం : గరుడగమన, రాజీవలోచన సాగర సదన, పన్నగ శయన [2] సర్వ నిలయా, సర్వాత్మకా సురేంద్ర సన్నుత, సత్య సంధా! [నీ పదముల] చరణం : సాధు పోషకా! పరమ పురుషా నిత్య కల్యాణం, పచ్చని తోరణం [2] అమృత మధనా! ఆర్తపరాయణా! వైకుంఠవాసా! శ్రీ వేంకటేశ! [నీ పదముల]
23.
నేనెంత అజ్ఞుడను పల్లవి : నేనెంత అజ్ఞుడను? నీయునికి వెదుక [2] అ.ప. : అంతట నీవె, నిండియుండిన స్వామి [నేనెంత] చరణం : అణువణువూ నీవె, పరమాణువు నీవె గిరులు, తరులు, పూవనముల నీవె [2] పూలను దాగిన మకరందము నీవె అద్భుతము, నీజేత! వచియింపగ స్వామి "2" [నేనెంత] చరణం : జలపాతముల నీవె, జలమున నీవె జల చరముల నీవె, చరాచరము నీవె [2] పిన పాపలలోని, ముసినవ్వులు నీవె ఊయలలూగేవు, తల్లిలాలిలో నీవె [నేనెంత] చరణం : పిల్ల తెమ్మెరలు, పెనుగాలుల నీవె పూబాలలో, శిరసూయల నీవె [2] హిమ బిందువు నీవె, బడ బాగ్నియు నీవె నాలోని నిన్ను, నలుదిశల వెదకేటి [నేనెంత]
24.
ఓ బొజ్జ గణపయ్య జై జై గణేశా! జై జై "2" పల్లవి : ఓ బొజ్జ గణపయ్య, నీ సాటి ఎవరయ్య నీ పోటి లేరయ్య "2" చరణం : సురలోకములో, సురల నుతులను అందుకొనుచూ సంతసమందేవు భూలోకపు పాట్లు, ఇక్కట్లను కనలేవా! ఓస్వామి! ఉండ్రాళ్ళనిన, బహు ప్రీతిలే నీకు బ్రహ్మాండమునూ, బొజ్జలో దాచితివి నీవు కుడుములు, భక్షములు, మనసార భుజియించి కోర్కెలీడేరగా, వరముల నొసగేవు "ఓ బొజ్జ" చరణం : భుక్తాయాసముతో, ప్రయాసపడు నిను జూచి సోముడు నవ్వాడులే! అంత సతీదేవి శాపము నొసగె అతని గనిన జనులు అపనింద పాలు అగునని నీ కధను వినినంతనె సర్వలోకమ్ములు బడయునంట, సౌభాగ్య సిరి సంపదలు బాధ్రపదపు చవితినాడు, నిను గొలిచినవారికి తీరునులే వారికి సర్వాభీష్టములు "ఓ బొజ్జ"
25.
O Hanumantha 03:13
ఓహనుమంతా, అతిబలవంతా! పల్లవి : ఓహనుమంతా, అతి బలవంతా! ఈజగమంత, నీనామమంత్రమె పలుకగ "2" చరణం : పెనుసంద్రమునే లంఘించి లంకను చేరె పవన తనయుడు దశకంఠుని దర్పమణచ లంకను గాల్చెను అంజని తనయుడు లోకపావని సీతమ్మ జాడను తెలిసి కొన్నడు అంగుళీయకము అమ్మకుయిచ్చి తెచ్చెను చూడమణీ "ఓహనుమంత" చరణం : మణిని గాంచిన రాముని కన్నులు (పొంగెను) నిండెను, ఆనంద భాష్ప ధారలు కొనియాడె రాముడు, హనుమంతుని నీ అంతవారు ఇలలో లేరని మెచ్చె రాముడు నీ భాషణము, ఎంతటి భాగ్యము అతడి వాక్కే మణి భూషణము, నిత్య నివాసము "ఓహనుమంత"
26.
O Yamma 03:20
ఓ యమ్మ! దుర్గ మాయమ్మ పల్లవి : ఓయమ్మ, దుర్గ, మాయమ్మ మా సల్లని తల్లివమ్మా "2" అ.ప : అడవంతా నీ సల్లని సూపులే మా అండ, దండనీవేలే "ఓయమ్మ" "2" చరణం : కొండలలొ పెరిగాము కోనలలో తిరిగుతాము మా అమ్మోరు నీవేనమ్మా కాపాడుదుర్గమ్మా, తల్లీ "ఓయమ్మ" "2" తెలియదాయె, పూజలు లేవు సదువు సందెలు తెలిసింది ఒక్కటే, సత్తెవాక్తు సహాయమె మా జనమహక్కు "ఓయమ్మ" చరణం : పిల్ల, పాపల కాపాడమ్మా బంగరు తల్లి ఓ దుర్గమ్మ "2" మా మనసె నై వేద్యంగా పెడతామోయమ్మా అండ నీవు వుండగా చెంతరాదు ఆపద "2" కొండంత దేవత మా గుండెల్లో కొలువుంటే చాలమ్మా
27.
ఊయలలూగవయా! పల్లవి : ఊయలలూగవయా ! కావేటిరంగా ఊయలలూగవయా! [2] చరణం : రవి చంద్రులు నీ ఉభయనేత్రములు నలుదిక్కులు ఆయె చతుర్బాహువులు [2] అఖిల బ్రహ్మాండము, ఉదరము కాగా వెలుగు తిమిరములె, డోలాయమానమై [ఊయల] చరణం : పంచ భూతములు, పంచాయుధములై ప్రాణి కోటియె, గగనతారలై [2] ఎల్లవేళల మము కాచెటివాడు మము పాలించేటి శ్రీ పాండురంగడు [ఊయల]
28.
Padunaru 02:32
పదునారు కళలతో పల్లవి : పదునారు కళలతో కళలొలుకు కామాక్షీ పద్మనాభసోదరీ, కర్పూరహారతిదిగో చరణం : దక్షిణ దేశమున, సలక్షణ దేవేరీ విలక్షణ లక్ష్యములు, దీర్చేటి లక్షిణివి దక్షుని పుత్రికవు, దాక్షాయణీ హిమగిరుని తనయవు, హైమావతీ "పదునారు" చరణం : సర్వాయుధకరివి, సర్వవిధ సంపన్న ముత్తైదుగ భాగ్యం, వరముగ నొసగెడి తల్లివి రూపము ఏదైన, మూల శక్తివి పాపము లన్నియు, పారద్రోలుమా! "పదునారు"
29.
పరిపరివిధముల పల్లవి : పరి పరి విధముల, పలురూపమ్ముల "2" పరిచయమాయెను, పరమాత్మ "2" చరణం : తండ్రి ఆనతిని, జవదాటనివాడుగ "2" రాజసమునకు, తను మారు రూపునిగ "2" వేదములు గాపాడ, అసురులనంతము జేసి "2" వేదనారాయణుడు, పరంధాముడు "పరి పరి" చరణం : బలితాపము నణచు, వామనమూర్తిగ ధరణిని గాచేటి, వరాహరూపునిగ కంసాది అసురుల పాలిటి, అనంతునిగ కలియుగమున మా గోవిందునిగ "పరి పరి" "2" చరణం : పట్టుబట్టి, ఈ జగములు గాచువాడిగ "2" తన పట్టుతోడ, దనుజుల దునిమెను "2" పట్టము గట్టి, మనల నాదరించునుగా "2" పదార్ధమై తాను, ఇల నడిపించును "పరి పరి"
30.
Paruguna 04:43
పరుగున రారే పల్లవి : పరుగున రారే, ఇంతులాలా పసి బాలుని జూడగ, ఇంతులాలా [2] అ.ప : పరిచయముతోనే ఇంతులాలా [2] పరమొసగే స్వామిని, ఇంతులాలా [పరుగున] చరణం : యశోద కన్నడే, ఇంతులాలా మనకు యశముల నిచ్చేనే, ఇంతులాలా [2] భుజగశయనుడే, ఇంతులాలా [2] మనలభుజములపై, మ్రోయునే ఇంతులాలా [పరుగున] చరణం : శక్తి, యుక్తులను, ఇంతులాలా శ్రమ లేక ఇచ్చునే, ఇంతులాలా [2] శరణను వారిని, ఇంతులాలా [2] శరవేగమున గాచును, ఇంతులాలా [పరుగున] చరణం : అణువంతేనే, ఇంతులాలా పలురూపముల, దోచునే, ఇంతులాలా [2] పరికించి చూడంగ ఇంతులాలా [2] బ్రహ్మండ మాతడే, ఇంతులాలా [పరుగున]
31.
Phalamu 05:26
ఫలము పుష్పము పత్రము పల్లవి : ఫలము, పుష్పము, పత్రము, తోయము ఏదైనను, నాస్వామి, చిరునగవులు చిందించు "2" అ.ప : సర్వాయుధిని మనసున నిలుపుము "2" తనకు అదియే నిజమైన అర్చనము "ఫలము" చరణం : కొండంత స్వర్ణ భాండమైనను కానగ, చిరు కానుక అయిననూ "2" ఏదైనను, తారతమ్యములు లేవులే! ఎవరికైనను, వసుడగునలే! "ఫలము" చరణం : భూపాలురు, మరియు పామరులు కడు బీదలు, ఘన కామందులు "2" ఎవరికైనను, ఎవరి చేతనైనను సమసేవల సముడు, నగధరుడు "ఫలము" చరణం : భావమె గాని, ధన సంపత్తి కాదని తర తమ బేధమే లేదని "2" వరు సర్వ మర్పించి కొలుతురో "2" పరదైవము, వారి మదిన కొలువగును "ఫలము"
32.
Pikamula 05:58
పికముల కిలకిల పల్లవి : పికముల, కిలకిల రవములతో "2" ప్రాభాతవేళల, పుష్పాంజలులతో "2" అ.ప : ఆనంద, సందోహ వందనం, భక్తులెల్లరును, నీరాజనం "పికముల" "2" చరణం : తాళ్ళపాక అన్నమయ్య, కృతరాజములతో నిను అలరించగ, వేచియుండెను, స్వామి "2" తిరువేంగమాంబ, ముత్యాలహారతితో "2" గానము సేయగా, వేచియున్నది స్వామి! వేగమె రావా! వేంకటరాయా "పికముల" "4" చరణం : సాగరమధనా! సంధ్యాకాంతుల "2" సప్తగిరులలో, ఎటుతిలకించిన నీ నామమె, ఇక నీ గానమే, స్వామి అణువణువూ, మరి నీ ధ్యానమే వేగమె రావా! వేంకటరాయా "పికముల" "4"
33.
Poojinture 07:30
పూజింతురే నిను పల్లవి : పూజింతురే, నిను పలుపూలతో స్వామి పూలపోలికలతొ, వర్ణింతురది, ఏమి [2] అ.ప. : తపమేమి జేసెనొ, నీపదములజేర అవితపమేమిజేసెనొ, నీపదముల జేర [పూజింతురే] చరణం : అరవిందమా! నిను వర్ణింప రమణీయం నీదళములబోల్చ, జలజాక్షుగన్నులు [2] ఎంతభాగ్యమేనీది, ఇల కమనీయము పద్మనాభునేబోల్చ, జేసితివే, పుణ్యం [పూజింతురే] చరణం : శశాంకుని వెలుగు, నీమేని తెలుపు శ్వేతాంగనవు, శోభాయమానవు [2] కమల నయన, నిన్ను కేశముల దురుమగ కళలొలుకుదువె నీవు, పుష్పరాజమా! [పూజింతురే] చరణం : అమరపురవాసిని, సురలోక పూజిత వెలిగెదవు నిత్యం, రమణుని గళమున [2] నీఛాయ అయినది, శ్రీహరికి ప్రియముగ జేసితివి పుణ్యం, నీజన్మమేధన్యం [పూజింతురే] చరణం : చంద్రుని చలువల, శశి కిరణమ్ముల వికసించెదవే నీవు శిశిర కాలమ్ముల [2] వాగ్దేవి ప్రియతమవి, శ్వేతవర్ణినివి కలువరాణివేనీవు, కావ్యనాయికవు [పూజింతురే]
34.
పురుషోత్తముడు పల్లవి : పురుషోత్తముడు, అమృతమయుడు సకలజీవులా, నిలయుడీతడు [పురు] చరణం : చిరు చిరు వెలుగుల దివ్వెల తానే చిగురు టాకులా పచ్చందము తానే [2] ఉదయకాలపు, అరుణిమలు తానే గోధూళి వేళలా కళలనూ తానే [పురు] చరణం : సెలయేరులలో గలగలలు తానే గిరి శిఖరములా ఘనత తానే [2] పికములు జేయు కిల కిల రావముల సరిగమలు తానే, తానే అంతయు [పురు] చరణం : ఖ్యాతియు తానే, రీతియును తానే నీతియు తానే, నిత్యము తానే [2] నిత్య సత్యము, తత్వము తానై వెలుగొంది నాడులే, వేంకట నాధుడై [2] [పురు]
35.
Puvvunaku 04:42
పూవునకు పూదారమునకు పల్లవి : పూవునకు, పూదారమునకు బంధమేల యుండునో! అలదైవమునకు, ఈమానవునకును, బంధమటులనే తెలుపగను "హరిలో రంగ హరీ" "2" చరణం : పూవునకు, పూతావికిని, బంధమేల యుండునో మాధవునకు, మానవునకునూ, అటులనే బంధముండును తరువులకు, మరి వ్రేళ్ళకూగల బంధమెటులుగా యుండునో మనుజునకు, అలదైవమునకును అటులనే బంధము "పూవునకు" చరణం : నగమునకు మరి భువికినీ గలబంధమెటులనో తెలుపగను నగధరునకు మరి నరునకూగల బంధమదియే యోచించగా తల్లికీ, మరి బిడ్డకూ గల బంధమేలనో ఇలలోన మహీధరుడు, మనుజునకూ గల బంధమే ఆబంధము "పూవునకు"
36.
Raava Rava 03:28
రావా! రావా! కదలి రావా పల్లవి : రావా! రావా! కదలి రావా, హరీ! నా, కన్నులనిండెను, నీరూపమే, హరీ! "రావా" చరణం : పిలచి, పిలచి నే నలసితినయ్యా నిను, తలవని, క్షణమైన మనలేనులే "2" గడిపెద, నీ స్మరణలొ, ఒక యుగమైనను "2" నిను గొలువక కష్టము, ఒక ఘడియైనను "రావా" చరణం : కొండల దేవర, మా అండ నీవేరా బండ సేయకు, నీ వెన్నగుండెను అండ పిండ, బ్రహ్మాండములలోన "2" మాకున్న దైవము, నీవే కాదా! "రావా"
37.
రామం రఘురామం పల్లవి : రామం, రఘురామం [2] లోకాభిరామం, ఆనంద ధామం [రామం] [2] చరణం : పితృవాక్య, పరిపాలనయే ధ్యేయం సోదర భావము, ఆచరణమార్గమై సర్వ జనసమ్మతమే, రామాభిషేకం రామరాజ్యము, ప్రజాదరణయోగ్యం పతీ, పత్నుల అన్యోన్నతకు ఆదర్శప్రాయమై, ఆచరణ యోగ్యమై [2] సత్యపాలనమె, సంస్కారమునకు రాముని పాలనం, మాతృలాలనం [రామం] చరణం : రామపాలనయె, పురజనుల క్షేమమై రామ రాజ్యమె, లోకాభ్యుదయమై సౌమ్య శీలతయె, శ్రీరామ కవచము రామావతారమె, లోకానికి హితము తారక మంత్రం, మనోరంజనం జానకి రామం, లోకాభివందనం [2] సరసిజ నయనుడు, కల్యాణ రాముడు అలరించు జగతిని, ఆనంద హృదిని [రామం]
38.
రామ నామ పారాయణము రాం రాం రాం రాం రాం రాం రాం రాం పల్లవి : రామనామ పారాయణము జీవనమె, పావనం "2" అ.ప : శ్రీ రామపాద రజితము సకల పాప హరణం "శ్రీ రామ" "శ్రీ రామ రామ, రామేతి; రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం; రామ నామ వరాననే;" చరణం : రామ నామము మదిన నిలుపుము తాపములన్నియు తొలగిపోవును "2" శ్రీరాముని చలువ, సుగుణాలవెల్లువ "2" అభినందనీయం, అనుసరణీయం, రామ నామము "రామ నామ" చరణం : తారక మంత్రం, ముక్తిసాధనం రామ స్మరణం, భవతాపహరణమూ "2" రామనామము, ముని జన వినుతమూ "2" శ్రీ రామపధము, పరమ పావనం రామ నామము "రామ నామ"
39.
Ramanamamu 06:03
రామనామము పల్లవి : రామనామము,మధురమైనదని, అందురేలనే అమ్మా [2] సకల పాపములు, సమసి పోవును, అందుచేతరా కన్నా "రామ, రామ, రామ, రామ, రామ, రామ, రాం" [2] చరణం : బాల రాముడు, రామచంద్రుడు ఆయనేలనే, అమ్మా [2] అద్దమున, చంద్ర బింబము చూచి, కిల కిల నవ్వెను కన్నా! సోదర ప్రేమకు "పట్టుకొమ్మ" ఏల ఆయనే అమ్మా! అన్నదమ్ముల మధ్య బంధమును, పెంపొందిచుటకు, కన్నా! "రామ, రామ, రామ, రామ, రామ, రామ, రాం" [2] చరణం : ఆలుమగల బంధానికి, వారే అందం, అందురు ఏల! లక్ష్మీ నారాయణులు, లక్ష్మణ మణి పూసలురా! కన్నా తండ్రి మాట జవ దాటనివాడని, ఏల అందురే అమ్మా! తండ్రీ తనయుల బంధమును, చాటి చెప్పుటకు, కన్నా! "రామ, రామ, రామ, రామ, రామ, రామ, రాం" చరణం : రాజ్యమువీడి, అడవులకుమరి, ఏల వెళ్ళెనే, అమ్మా! రాయినిసైతం "రామమయం" చేసేటందుకె, కన్నా! ఆలిని బాసి, అసువులిమకగ, దుఃఖించెనేలనమ్మా [2] పదితలల రావణునంతము జేసి, శాంతి నిలుపటకు,కన్నా! "రామ, రామ, రామ, రామ, రామ, రామ, రాం" [2] చరణం : రాముడు, అందరి దేవుడాయెను యేల చెప్పవే, అమ్మా! సర్వ గుణములకు, పెద్ద పీటను, వేసినందుకుర, కన్నా! దేవ దేవుడు, అవతారములు, దాల్చు నెందుకే! అమ్మా! దానవుల జంపి, ధరణి కాచుటకు కన్నా! "రామ, రామ, రామ, రామ, రామ, రామ, రాం" [2]
40.
సిరి సిరి మువ్వల పల్లవి : సిరి సిరి మువ్వల, సిరిరాయుండే సిరులతో గూడి, మనల జూడవచ్చేనే "సిరి" చరణం : కరములలో శంఖ చక్రములూ ఉదరమున బ్రహ్మాండ మండలం "2" సిరిగల కన్నులు కాంతు లీడునులే "2" సిరితో గూడీ కొలువై యున్నాడే "సిరి" చరణం : జలజానాధుడె, జాలి బూనగ జాతులన్నిట మిన్న, జాతి బిడ్డయే వాడు "2" వేదపు రాసులకు, వేదాంతియే వాడు "2" వేడుకలోనూ, మనల వీడజాలడే "సిరి"
41.
సిరిపురవాసినికి పల్లవి : సిరిపురవాసినికి, శ్రీ మహాలక్ష్మికి "2" హరి హృదయవాసినికి నీరాజనం నిత్య నీరాజనం "నీరాజనం" అ.ప : భక్త జన పోషణికి, భక్తహృదయాలకు పద్మసంభవకును, నీరాజనం నిత్య నీరాజనం "సిరి" చరణం : అంబుజ వాసినీ! అబ్బుర పరచేవు "2" ఎనలేని, కీర్తి యశస్సుల నొసగి అంబుజాక్షునీ, హృదయ పీఠమున వసియించి, సిరులను అందింతువూ నీరాజనం, నిత్య నీరాజనం "సిరి" చరణం : మునిగణ సురవినుత, మునిజనానంద "2" దీనజన పాలికా, దిగంత వ్యాపికా సాగర తనయా, సరసిజనయనా సర్వాత్మకాత్మకా, సంతుష్టప్రదాయికా నీరాజనం, నిత్య నీరాజనం "సిరి"
42.
సిరి సిరి మువ్వల కృష్ణయ్యా పల్లవి : సిరిసిరి మువ్వల కృష్ణయ్యా శ్రీరంగ రాయా! కృష్ణయ్యా [2] అ.ప : ముద్దు కృష్ణుడ వీవయ్యా మురిపాల బాలా రావయ్యా [సిరి సిరి] చరణం : కన్నయ్యా! నీమహిమలు జూపి గోకుల వాసుల మనసులు గెలిచి గోకుల బాలా! వేణువునూది గోపికలందరి మనమున నిలచి కలిగించితివీ, నీవు భక్తి భావము దెలిపితివయ, నీవు వైరాగ్య యోగము రేపల్లె వాడల వెన్ననుదోచి నవనీత చోరా! అల్లరి చేసి మనసులుజేతువె, నవనీతభరితం [సిరి సిరి] చరణం : కొండలలో వెలిశావయ్య మాకండగ నీవు నిలిచావయ్య ధర్మ స్థాపనం, నీ ఆంతర్యం ప్రతియుగ మందున నీఅవతారం సత్య, ధర్మ, న్యాయం, నీలక్ష్యమట, శోధ, సాధనం, నీ సంపూర్ణత్వమట కర్మయోగమే, గీతా సారం ధర్మరక్షణం, మా కర్తవ్యం నాల్గు వేదముల సారాంశం అందించితివీ, జీవన వేదం కలియుగమున, మాకొండలరాయా [సిరిసిరి]
43.
Sirulanosage 02:57
సిరుల నొసగే! శ్రీ గౌరీ! పల్లవి : సిరులనొసగే, శ్రీగౌరీ మంగళం జయమంగళం, శుభ మంగళం అ.ప : శుభకారిణి, శ్రీ శక్తి మంగళం జయ మంగళం, శుభ మంగళం చరణం : శ్రావణ మంగళ వారములు శ్రావణ మాస, సౌభాగ్యములు సంపద నొసగే మంగళ గౌరీ బుద్ధిని ఒసగే శ్రావణ గౌరీ సంతసమున మాగృహముల విచ్చేయవమ్మా ఆనందకారిణి, మంగళదాయిని "సిరుల" చరణం : సువాసినుల అర్చనలతో శుభముల నొసగే, జయ, శుభ జననీ సామ్రాజ్యదాయిని, సర్వమంగళదాయిని నీవే మంగళహారతులివె మంగళ శుభగౌరీ సర్వార్ధకామిని, సత్యపాలినివి "సిరుల"
44.
శివానందచరితం పల్లవి : శివానందచరితం, స్తితికారకం, లయకారకం ఇది సదానందభరితం "శివా" చరణం : నాగాభరణం, శోభాయమానం చంద్ర చూడం, మకుటాయమానం ఢమరుకధ్వానం, ఓంకారనాదం హరుడు నర్తించే ఆనంద తాండవం ప్రమధగణములు, సురలు భూసురులు విస్మయత్వముతో పరవశించెను షణ్ముఖ, గణపతులు, తన్మయత్వము సమభాగతత్వం, సురనాయకత్వం "శివా" చరణం : అఖిలాండేశం, అర్ధనారీశం అసురవరదాతం, రవిసులోచనం కైలాసగిరి జేసెను పుణ్యము అఖిల జగములు ముదమాయనులే అసురుల దునుము పినాకము అఖిలజగములు స్వర్గతుల్యము నటరాజరూపం, ఆనందనర్తనం భస్మధారణం, అష్టైశ్వర్యం "శివా"
45.
శ్రీ పాండు రంగం పల్లవి : శ్రీ పాండురంగం, నమామ్యహమ్ శ్రితపారిజాతమ్ నమామ్యహమ్ [2] అ.ప : నీ పాదరజితం, నమామ్యహమ్ మా పాపహరణం, నమామ్యహమ్ [శ్రీపాండు] చరణం : అగణిత నామం, నమామ్యహమ్ మునిగణ పాలనం, నమామ్యహమ్ [2] సుమధుర చరితం, నమామ్యహమ్ సురాసురవినుతం, నమామ్యహమ్ [శ్రీపాండు] చరణం : నీ లలిత తేజసం, నమామ్యహమ్ సలలితరాజసం, నమామ్యహమ్ [2] మధురానగరం, నమామ్యహమ్ ఆనంద పోషణం, నమామ్యహమ్ [శ్రీపాండు] చరణం : కళత్ర సంయుతం, నమామ్యహమ్ మధురాతి మధురం, నమామ్యహమ్ [2] నీ పాదయుగళం, నమామ్యహమ్ జన్మహరణము, నమామ్యహమ్ [శ్రీపాండు] చరణం : నీ నామ స్మరణం, నమామ్యహమ్ మోహనాశం, నమామ్యహమ్ [2] భక్త పోషకం, నమామ్యహమ్ వైకుంఠరాజం, నమామ్యహమ్ [శ్రీపాండు]
46.
శ్రీ రంగనాయకి పల్లవి : శ్రీ రంగనాయకి, వైకుంఠరమణి దయసేయవమ్మా! మామానసముల అ.ప : చంద్ర సహోదరి, శ్రీ మహలక్ష్మీ కరుణించవమ్మా, కమల వాసిని "శ్రీ రంగ" చరణం : జగతి, నీతో నడచు, అనునిత్యమమ్మా జీవన పధములో, నీవొక భాగమే సకలవిధులకు నీవే ఆధారం సౌమ్య శీలుర గృహమే నీ వాసం సత్య వాక్కు, సత్య భూషణుల హృదయములందే సతతం, కొలువుదీరి, కాతువే మా తల్లి, మహలక్ష్మీ "శ్రీ రంగ" చరణం : సాగరమధనమున, ఉద్భవించితివి, తల్లీ విష్ణుదేవుని పత్ని సిరిగల తల్లివి సముద్రతనయవు, త్రైలొక్య పూజితవు కొలువుండవమ్మా, కాపాడవమ్మా! ఏ గృహము నిత్యము రంగవల్లులతొ తీర్చిదిద్దేనో, అది నీ నివాసము సుమసుహాసిని, సుమధుర భాషిణి "శ్రీ రంగ"
47.
శ్రీ సత్యనారాయణ వ్రతము పల్లవి : శ్రీ సత్యనారాయణ వ్రతము మహిలోన జనులకు శుభప్రదము "2" అ.ప.: మహిమాన్వితము, మహిమోపేతము సత్యవరదుని, కధల సహితము "శ్రీ సత్య" చరణం : పంచాధ్యాయముల వ్రతకల్పము పంచపాతకములు పారద్రోలును "2" పంచామృతముల పావనామృతం పంచేంద్రియములు పరమ పవిత్రం "శ్రీ సత్య" చరణం : వైకుంఠుని మహిమల వ్రతరాజము వైకుంఠ ద్వారములు సులభసాధ్యము "2" వైకుంఠుని నామమె పరమ పవిత్రం వైకుంఠ ధామమె, పావలవిత్రం "శ్రీ సత్య"
48.
శ్రీ సీతారాముల కల్యాణం పల్లవి : శ్రీ సీతారాముల కల్యాణం కనివిని ఎరుగని వైభోగం "2" అ.ప. : హరికీ, సిరికీ కల్యాణం దివిలో, భువిలో రమణీయం "శ్రీ సీతా" చరణం : కోసలేంద్రునీ కల్యాణం కనిన కలుగును, పెనుపుణ్యం "2" కన్నుల పండుగ ఆజంట "2" మనమెన్నిజన్మలకు కనలేమంట "శ్రీ సీతా" చరణం : ధర్మ స్థాపన శ్రీ కారం ధర్మ నితతికీ సాకారం "2" ధర్మ మూర్తిగా నిలచు విగ్రహం "2" శివ కేశవులకు ప్రతి రూపం "శ్రీ సీతా" చరణం : లోకకల్యాణం, రాముని జననం లోకోద్ధరణమె, రామమతం "2" దుష్ట శిక్షణం, శిష్ట రక్షణం "2" ఒసగెను, జగతికి ఆనందం "శ్రీ సీతా"
49.
శ్రీ ఆంజనేయం (దండకము) పల్లవి : శ్రీ ఆంజనేయం, హృదయాంజలీయం ధ్యానాంజ నేయం, దాసాంజనేయం [2] చరణం : లోకపావనము, శ్రీ వాయుపుత్రం లోకపూజితమూ, అభయాంజనేయం [2] శోకనాశనము, కేసరీతనయం పాతక నాశనము, పవిత్రహృదయం [శ్రీ] చరణం : శ్రీరామ కార్యం, శ్రీరామ దూతం శ్రీరామ హృదయం, అంజనీతనయం [2] భూత నాశనము, శ్రీ హనుమంతం సంభూత కారణం, శ్రీ పింగాక్షం [శ్రీ] చరణం : దైత్య నాశనము, వీరాంజనేయం దౌర్బల్య నాశనం, మారుతీబలం [2] ధన సంప్రాప్తం, శూరాంజనేయం సతతం స్మరణం, అమితంవిక్రమం [శ్రీ]
50.
శ్రీ ఆంజనేయం అసమాన కాయం పల్లవి : శ్రీ ఆంజనేయం అసమాన కాయం అంజనీతనయం అపురూప తేజం [2] చరణం : దినకరుని ఫలమని తలచి నీవు నింగికెగరి వరములె బడసితివి [2] లోకపూజితము నీ అమృత భాషణము రాముని హృదినే దోచిన ఘనుడవు [శ్రీఆంజనేయం] చరణం : నీ శక్తి నీకు తెలియరాదు నిను స్తుతియింపగ అంతటనీవు [2] సకలలోకముల నుతులందేవు వీరాధివీరుడవు వీరాంజనేయుడవు [శ్రీ ఆంజనేయం] చరణం : రాముని కార్యము అవలీలగా జేసి హృదయమున రాముని నిలిపినావు [2] సుందరకాండకు సుందరుడే నీవు మహిమాన్వితము నీపావన చరితము [శ్రీ ఆంజనేయం] చరణం : కీర్తి యశస్సుకు మారుపేరుగా నిను పూజించిన తిరుగులేదుగా [2] అమృతమయుడవు అసమానదేవుడవు ఆర్తులపాలిట కామధేనువు [ శ్రీ ఆంజనేయం ]
51.
Srilakshmi 03:55
శ్రీ లక్ష్మి జయలక్ష్మి పల్లవి : శ్రీ లక్ష్మి, జయలక్ష్మి, సంతానలక్ష్మి సిరులు కురిపించవే, తల్లి మహలక్ష్మీ [2] చరణం : సకల సౌభాగ్యములు, కలిగించు తల్లివి సద్గుణ, సంపదలు, పొందు వరమీయవే [2] నిను గొలిచిన క్షణము, కరుణించి, మము నీవు కనుసన్నల, కరుణ, కురిపించవే తల్లి [శ్రీ] చరణం : చిరుమందహాసముల, శోభిల్లు తల్లి మందార మల్లికల అర్చింతుమే నిన్ను [2] అరవిందుని రమణి, అలరారు చుండగా అంగ రంగ విభవముల వెలుగు తల్లి [శ్రీ] చరణం : క్షీరాభ్ధికన్యకవు, శ్రీరామపత్నివి సహన శీలమున అగ్రగామివి నీవు [2] సకలాభీష్టములు నెరవేర్తువే నీవు మనసు ఫలకము నందు, కొలువుండు జననీ [శ్రీ]
52.
శ్రీనివాసుడంట పల్లవి : శ్రీనివాసుడంట, అమ్మలాలా వాడుసిరులిచ్చు, శ్రీ పతంట, అమ్మలాలా [2] అ.ప : ఏడు కొండలెక్కి, ఏడేడు లోకాలు పాలించునంట, అమ్మలాలా [శ్రీ] [2] చరణం : అందరిని కాచేను, ఆదుకొని బ్రోచేను అందరి వాడంట అమ్మలాలా [2] సత్య భాషణల, సత్య మార్గముల నడుపు దైవమట, అమ్మలాలా యుగయుగాలకు, ప్రతిమనమ్మున నిలచు దేవుడట, అమ్మలాలా [శ్రీ] చరణం : ఆలుమగల మధ్య అన్యోన్యతకు ఆదర్శ ప్రాయుడంట, అమ్మలాలా [2] ఎన్నెన్ని లోకాలు, వెదికి చూసినను అటువంటి దైవమె కానరాడంట [2] యుగ యుగాలకు, ప్రతి మనమ్మున నిలచు దేవుడట, అమ్మలాలా [శ్రీ]
53.
సుదర్శన చక్రమా పల్లవి : సుదర్శన చక్రమా, శుభదర్శన చక్రమా అసుర భంజనమా, సుర పూజితమా [2] చరణం : సహస్ర సూర్యకాంతులీను, హరి చక్రమా మాయా మోహములను, ఛేదించు చక్రమా [2] శిష్టుల పాలి, శశికాంతి చక్రమా కాలుల పాలిటి, కాలచక్రమా [సుదర్శన] చరణం : అధర్మశీలుర, అంత మొందించుటకై సహస్ర ధారల, అసాధ్య చక్రమా [2] లోకకంటకుల, కరడుగుండెలలో కదము ద్రొక్కేటి, కరకుచక్రమా [సుదర్శన] చరణం : తారతమ్యములను, తుడిచివేయు చక్రమా తామరతూడువలె, సున్నితచక్రమా [2] కరుణార్ధ హృదయుల, గాపాడుచక్రమా కరుణాంతరంగుని, కరమున చక్రమా [సుదర్శన]
54.
సూక్ష్మమందునూ పల్లవి : సూక్ష్మమందునూ గనిపించు బ్రహ్మాండముగా గోచరించు "2" అ.ప : నందనందునీ గొనియాడూ నారాయణునీ గాంచూ "సూక్ష్మ" చరణం : గిరులయందునూ కనిపించు గిరిధరునీ కొనియాడు "2" ఘనాఘనుని ఘనముగను "2" గమ్యము తానుగ గోచరించే "సూక్ష్మ" చరణం : సర్వము తానుగ సూచించే సర్వోత్తమునీ స్తుతియించూ "2" సర్వలోకములు పాలించే "2" సహస్ర ముఖినీ కొనియాడూ "సూక్ష్మ"
55.
Suprabhata 03:59
సుప్రభాత వేళలలో పల్లవి : సుప్రభాత వేళలలో షోడస విధముల సేవలలో అ.ప : నానాభరణ శోభితా నానా భువన పూజితా "సుప్రభాత" చరణం : బంగారు పదముల, శ్రుంగారరాయ! భక్తితో దాసోహ మగుదమయా "2" అమృతమధనా! నీ అనంతవిభవములు "2" ఆనంద మందార, ప్రాభాత హారతులివిగో "సుప్రభాత" చరణం : నీ పాదసేవయే, నిత్య కల్యాణము మంగళకరము, మంగళదాయకము "2" హృదయ పీఠమున కొలువైననీ రూపం "2" హృదయాలయమున, నిరతము నిలుపగ రావా! "సుప్రభాత"
56.
Tenugunatanu 02:41
తెనుగునాటను పల్లవి : తెనుగునాటను బుట్టి, జానపదమునకు వన్నెతెచ్చిన, వెన్నెల రాజమా! అ.ప : మా అన్నమయ్యా! నీసాటి ఎవరయ్యా! [2] చరణం :అన్నప్రాశననాడు, కలమును చేపట్టి భవితకు, భాష్యము తెలిపిన పాపడు హరినామమును, వినక, అరమెతుకు ఐనను ముట్టడీ బిడ్డడు, మురిపించె తనయుడు అలవేంకటపతి, అర భుజియించినది దినిన ఆతడు, అవ్యాజకరుణను పొందె, ఘనుడు [మాఅన్నమయ్య] చరణం : భక్తి, శృంగారముల, సంకీర్తనలచే కంజదళాయుని, చక్కగా నలరించె అలరు, అలమేల్మంగపతి, మదిని గెలిచెను ఇలను, ముక్తిని బడసి, జగతిలో నిలచెను తొలుత వాగ్గేయకారునిగ తనువెలిగెను తెలుగు పదములకు, ఆయువు పట్టాయెనతడు [మాఅన్నమయ్య] తెనుగునాటను
57.
Thanaku 03:20
తనకు మారుపేరుగా పల్లవి : తనకు మారు పేరుగా గల తనను మించిన వారుగా గల "2" అ.ప : సత్పురుషులు, సత్ప్రవర్తనుల జఠరమునందునె భగవానుడు జనియించు "తనకు" చరణం : నిష్కాములు, నిశితాత్మకులును స్తితప్రజ్ఞులు, సత్కర్మయోగులకు కర్మాచరణులు, ధర్మాచరణులు సత్యవచనులు, సత్యాత్మకులుగా చరియించు జనుల, జఠరమునందుననే "2" పసిపాపడిగా భగవానుడు జనియించును "తనకు" చరణం : మనసా, వాచా, కర్మణా తనను తాను అర్పించుకోగల దేహచింతయే లేక, యిహమే పరమనుకొని చరియించువారల, ఉదరముననె తమ బిడ్డగాజనియించి "2" తాను తరించేనులె! వారిని తరియించి "తనకు"
58.
Tribhuvana 04:34
త్రిభువనపాలిని పల్లవి : త్రిభువనపాలిని, ఆదిపరాశక్తి పరమపావని, లోకహితైషిణి "2" చరణం : శుంభ, నిశుంభ మర్దినీ "2" సదాచార ప్రవర్తినీ సమంద హసిత శోభినీ "2" కుమార, గణనాధ మాతృకే "త్రిభువన" "2" చరణం : పరమయోగిని, పాపనాశినీ "2" పాతకమోచని, పతితపావనివి మహదేవరమణి వ్యాఘ్రవాహినీ "2" మహానాయకి, మహిమాన్వితే "త్రిభువన" "2" చరణం : కరుణాంతరంగిణి, కమనీయ చరణి "2" సరళ భాషిణి, సచ్చరిత పోషిణి ప్రణవ రూపిణి, పరమార్ధదాయిని "2" కామ్యార్ధ సిద్ధే, కనక వర్షిణీ "త్రిభువన" "2"
59.
Tulatoogena 03:37
తుల తూగేనా పల్లవి : తులతూగేనా, నాస్వామి, ధనరాసులకు, మణిపూసలకు "2" అ.ప. : భక్తియనుధనమును కురిపించగనే స్వామి "2" సంతృప్తుడగును, సత్యలోకవాసుడు, శ్రీనివాసుడు "తుల" చరణం : ధన, సంపదలతో తూచగలేము, ఆతని ధనేతరములచే కొలువజాలము "2" భక్తిధనముతో ఎవరుగొలిచిననూ "2" వారికి వశమగును పురుషొత్తముడు, పురుషొత్తముడు "తుల" చరణం : ప్రియవాక్కులూ, మరినిశ్చలమనము పరిపూర్ణమైన, భక్తిభావముతో "2" ఎవర నాతని, తమమదిననిలుపునో "2" వారిహృదిలో ఎపుడూ, కొలువుండును "తుల"
60.
Upanayanam 03:38
ఉపనయనం పల్లవి : ఉపనయనం, ఉపనయనం "2" అ.ప : జగమేలు స్వామికి, యజ్ఞోపవీతధారణం "ఉప" చరణం : జగములనొక త్రాటిపై, నడిపించే స్వామికి "2" ముద్దులొలుకు మూడుప్రోగుల యజ్ఞోపవీతం చతుష్షష్టి కళలతో తులతూగు స్వామికి షోడస కళలతో, కళలొలికే స్వామికి "ఉప" చరణం : ద్వారకావిభునకు, స్వర్గద్వారముల సులభునకు ముల్లోకములేలు స్వామికి, ముచ్చటైన యజ్ఞోపవీతం జగన్నాటక సూత్రధారికి, జయ జయ ధ్వానముతో "2" మురిపించు మూడు ప్రోగుల, యజ్ఞోపవీతం "ఉప"
61.
ఉయ్యాలా! జంపాలా! పల్లవి : ఉయ్యాలా! జంపాలా! నట్టనడిమినది, సుఖఃదుఖములడోల "ఉయ్యాలా" చరణం : పసిప్రాయమందున, ఆటపాటలజోల యవ్వనప్రాయమున, విద్యార్జనహేల "2" వయసుడికిన వేళ, వేదాంత వూయల మధ్యననున్నది, జీవనహేల "ఉయ్యాలా" చరణం : సత్సంగ సాంగత్యం, జ్ణానమునకు వూయల గ్రంధపఠనమే, విజ్ఞాన వూయల "2" ఉపకారమనునది, నిస్సందేహ వూయల అపకారికైనను, ఉపకార వూయల "ఉయ్యాలా" చరణం : అస్సాధ్యమైనను, సాధన వూయల అణువంతైనను, సంతృప్తివూయల ఇసుమంతైనను, కొండంత వూయల గోవిందునిసేవే, ఆనంద డోలల "ఉయ్యాలా"
62.
ఉయ్యాలా! ఉయ్యాలా! పల్లవి : ఉయ్యాలా! ఉయ్యాలా! ఉయ్యాలా! "2" ఉయ్యాలా! వెంకటరమణుకుయ్యాలా "2" సిరుల హారతీయరే ఉయ్యాలా! క్షీర ప్రియునకు ఉయ్యాలా! క్షీర సంభవకు ఉయ్యాలా "ఉయ్యాలా" "2" చరణం : సీతారమణునకు, ఉయ్యాలా! పీతాంబరునకు ఉయ్యాలా "2" అఖిలలోక విభునకు ఉయ్యాలా "2" అనంత వైభవములకు ఉయ్యాలా "ఉయ్యాలా" చరణం : శంఖ, చక్ర ధరునకు ఉయ్యాలా! అసంఖ్య నామ బిరుదునకు, ఉయ్యాలా! "2" సర్వపాప హరునకు ఉయ్యాలా "2" సహస్రనామ ధేయునకు, ఉయ్యాలా! "ఉయ్యాలా"
63.
Vadi Vadi 04:16
వడివడిగా పల్లవి : వడివడిగా, అడుగులు పడిననూ పొగడుచు, నామది, హరి నిన్నేతలచును "వడివడిగా" చరణం : మనమున నిన్నే, నమ్మితిని ఎదలో నిన్నే, కొలువుంచితిని "2" సురలు, యోగులు, మునులు, ఎల్లరును "2" భావమ్ముల నిను, సాధింతురుగా "వడివడిగా" చరణం : సత్యము ఎచ్చట, స్థిరముండునో ధర్మము ఎక్కడ, ఆదరింతురో "2" అచ్చట, అన్వేషకుల ఎదలను "2" ఒక ఘడియైన, విడువక తిరముండేవు "వడివడిగా"
64.
వైకుంఠథాముని పల్లవి : వైకుంఠథాముని దూతలము అల వైకుంఠపురి, మానివాసము "2" అ.ప : మోహలోభములను, విత్తమును చేకొని మోక్షమనే, భాగ్యపు వడ్డీని యిచ్చెడి "వైకుంఠ" చరణం : నాలుగువేదముల ధనరాసులను పదునాలుగు భువనముల వారలకిచ్చి "2" "భక్తి" సంపదలను, భాండాగారమును "2" చేకొని, "ముక్తి" నొసగు వారలము "వైకుంఠ" చరణం : దామోదరునకు, దాసులమగుటయె నిక్కమైన, నిశ్చల భక్తిమార్గము "2" దాసోహమగును, వారలకాతడు "2" దాస్యముక్తులను, సేయునాతడు "వైకుంఠ"
65.
వందనమమ్మా పల్లవి : వందనమమ్మా! అభివందనం మా చదువుల తల్లీ! అభివందనం సకలవిద్యలసారము, ఈ సర్వశక్తిసాకారము సత్యరూపమయి, సామగానమయి, హంసవాహినీ"వందన" చరణం : వీణావాణి, పుస్తకపాణివి నీవే సకల కళల కాణాచివి నీవే వికసిత వదనపు శిశిరకాంతివి నీవే వెలుగు చిందుమా భారతి నీవే బ్రహ్మదేవుని మానసవల్లి అష్టసిద్ధులొసగు నాల్గువేదముల మూలశక్తివి ఇల మము తరియింపవె తల్లీ "వందన" చరణం : స్వచ్ఛమైన వాక్కు, వచనం నీవే విద్య నేర్పించు సత్యము నీవే సిరియు, విద్యయు, ఉభయము నీవే నరులు పొందుదురు భూతల స్వర్గము విద్యతోనె మనుగడ సతతం విద్యయొసగు సకలం విద్య కలిగినచొ ఉన్నత స్థానం సర్వ సుఖములకు సోపానం "వందనం"
66.
వేదములందును పల్లవి : వేదములందును, వశియించేను వేదనలను బాపును వేంకటనాధుడు "2" చరణం : వేడుకలందునూ, విడువక తాను "2" వెన్నంటి వుండును, వేంకటనాధుడు వేద, వేదాంత అంతరంగుడు ఆశ్రిత జనుల, శరణాగతుడు "వేదము" చరణం : ఆది, మధ్యాంత రహితుడు తానేలే "2" అన్నింట వ్యాపించు అఖిలాత్ముడులే! ఆదిమ పురుషుడు, ఆది దేవుడు "2" యోగీశ్వరుడు, యోగులకు వశుడు "వేదము"
67.
Vedantavedya 04:08
వేదాంత వేద్యా పల్లవి : వేదాంత వేద్యా, వేదనిలయా [2] అ.ప : మహిమాన్వితము, నీ మానుష జన్మము [వేదాంత] చరణం : నరుని రూపమున అవతరించిన నాద రూపమా! నారాయణా [2] భవబంధములూ పారద్రోలే భాగవతోత్తమా! భయాపహారా! [వేదాంత] చరణం : ఇంద్రాది సురలను, గాంచి మిగుల అచ్చెరు వొందితివి, రామ తేజమా [2] విష్ణుపధమూ నీవే కాదా! విశ్వమునకే, తండ్రివి గావా! [వేదాంత]
68.
Vedukalonu 05:13
వేడుకలోనూ పల్లవి : వేడుకలోనూ, వేదన యందున నీ పదములె, మా గతియని నమ్మితి [2] అ.ప : వాడవాడలలోన, వాడియగురూపము [2] వారధిగానిలచి, వరములొసగేను [వేడుక] చరణం : అంతర్యామివని నినుకొందరందురు నిరాకారుడవని మరి కొందరందురు [స్వామి] వక్కాణింతురు, వేద వేద్యులు [2] ఏదైనను, నీది దివ్యరూపమని [వేడుక] చరణం : భక్తాశ్రేయుడవని అందురు కొందరు భక్తసులభుడని ఇంకొందరందురు పొగడుదురే, నిను పలునామమ్ముల [2] ఏమైనను, నీనామమే, నిక్కము [వేడుక]
69.
Veduru 06:25
వెదురు కొమ్మన సప్త స్వరములు పల్లవి : వెదురుకొమ్మన సప్త స్వరములు పలికెనులె! అవివేయిరాగములు [2] అందరి మది దోచెను ఆనందుని కడ జేరెను వేణువై విలసిల్లెను వెదురుఎంత పుణ్యముచేసెనో! [వెదురు] చరణం : కానల బుట్టేను, కానల బెరిగేను వాయుతరంగము, గడుపు నింపేను [2] వెదురు గొమ్మయె వేణువాయెను తరంగములు సరిగమలు ఆయెను [వెదురు] చరణం : నంద గోపాలుని కరములందున జేరి మృదు స్పర్శకు అది పులకించి పోయింది [2] బృందావనిలొ, రాధమ్మ మదిలో సమ్మోహినై తారంగ మాడింది [వెదురు] చరణం : ఎల్లగోపాలురు పశుపక్ష్యాదులు తన్మయత్వమున, ఆడి పాడేరు [2] గోకులంబంత, మృదు రవళుల ఆనంద నాట్యముల మురిసిందిలే [వెదురు] చరణం : నందగోపాలుని స్పర్శ చేత వెదురు ఆయెను, పిల్లన గ్రోవిగ, భువిలోన [2] ఆగాన లోలుని కరుణుంటే రాయి అయిన, "రత్నము"గ మారేనులే [వెదురు]
70.
Velugu 03:40
వెలుగు వెలుగు పల్లవి : వెలుగు వెలుగు వెలుగు ఆకాశమంత వెలుగు "2" అ.ప : జిలుగు జిలుగు జిలుగు తన మేని రంగు జిలుగు చరణం : ఈలోకమంత వెలుగు మనశోకమంత తొలగు ముత్యాలసంపద మన చేరువనే దొరకు ముక్తిసంపద, మన ముంగిటనే దొరకు "వెలుగు" చరణం : ఆకస మందున చుక్కల వెలుగు చుక్కల నడుమ, బహు చక్కని స్వామి కాళీయమర్దుని కాంతుల వెలుగులో తనువు పరవశించు, మన మనసు పులకరించు మానస వీధిలో విహరించే స్వామి మన మానస వీధిలో విహరించే స్వామి "వెలుగు"
71.
Venkatachala 04:01
వేంకటాచల నిలయుడే పల్లవి : వేంకటాచల నిలయుడే [2] వెలుతులు దీర్చేను, ఆతడే [వేంకటా] అ.ప : వెల వెల బోవు, మనసులలోన వెలుగును నింపే, కిరణము ఆతడే [వేంకటా] చరణం : నగవులు చిలికేటి నగధరుడే నవనీతముతో, మనసు నింపెనే [2] అందరి మనసులు, దోచేనే నంద బాలునిగ, బృందావనమున [వేంకటా] చరణం : రుక్మిణీ, సత్యల, ప్రియ వల్లభుడే ఎల్ల జగములకు, విభుడాతడే [2] ఇద్దరుతల్లుల, ముద్దుల పాపడే మము గాచేటి, మురళీ లోలుడే [వేంకటా]
72.
వెఱ్ఱి యోచనలు పల్లవి : వెఱ్ఱి యోచనలు, మస్తకమున నిండుగ ఎటు పోతువే, నీవు ఓ మనసా "వెఱ్ఱి" ఓ మనసా! ఓ మనసా! "2" చరణం : దానవవైరిని కానక, మనుజుల మాటలను, నీవు అనుసరించిన, అది ప్రమాదముగాదే "2" దనుజ లోకమున, త్రికరణ శుద్ధిగ "2" వెదుకగ దైవమును కనగలవు ఓ మనసా! ఓమనసా "వెఱ్ఱి" "2" చరణం : మాయపు ఛాయల, వెంటన ఎంతగ నీవు పరుగిడిన, కనలేవు నీవు, పరంధాముని పరముతానని, నీవు తలచిన నాడే "2" నీ నీడే అగును, పరమాత్మ రూపము ఓ మనసా! ఓ మనసా! "వెఱ్ఱి" "2"
73.
Vinatulive 04:31
వినతులివె పల్లవి : వినతులివె, చేకొనవొ, తల్లీ, వరలక్ష్మీ హారతులివె, గైకొనవొ, తల్లీ, మహలక్ష్మీ "2" చరణం : చేరి అందరము, మ్రొక్కి, కోర్కెలను కోరేము అభీష్టములు నెరవేర్చవె, తల్లీ నారాయణీ! "2" మానసముల మలినమును, కడిగివేయుమమ్మా "2" పరిపూర్ణ మనసులనె, అర్పింతుమమ్మా "వినతులివె" చరణం : తొలి వేకువలొ, అల కోయిలల స్వరముల సరిగమల రాగమె, నీ గానముగ "2" తొలి కిరణములు, నీకు అందించునమ్మా "2" పిండివెన్నెల, దీపారాధనగా, అమ్మా! "వినతులివె" చరణం : అష్టసిరులను, నీవు అందించగ, రావమ్మా భోగభాగ్యములను, కరుణించగ, రావమ్మా "2" నీ మువ్వల సవ్వడులె, సంపద కావళ్ళు "2" నీ ముత్యపునగవులె, ముద్దబంతిలోగిళ్ళు "వినతులివె"
74.
Vinayaka 03:21
75.
వినాయకం పల్లవి : వినాయకం, శ్రీ విఘ్ననాయకం గజాననం, శ్రీ గణనాయకం చరణం : శివ పార్వతులకు కొమరుడివే నీవు కార్తికేయుని సోదరుడైనావు "2" మూషికవాహనము, గగనవిహారము "2" భువినేలగ నీవు రావయ్యా! గణపయ్యా "వినా" చరణం : మధుర ఫలమ్ములు, పంచ భక్ష్యమ్ములు ఆర్తితో మేము అర్పింతుమయ్యా "2" భక్తుల కోర్కెలు శీఘ్రమె దీర్చగ "2" వరములొసంగగా, రావయ్యా, గణపయ్యా "వినా" చరణం : సిద్ధీ, బుద్ధులను పరిణయమాడి సందేశమిడెదవు, శిరసావహితము "2" విద్యాబుద్ధులు, కామితసిద్ధులు "2" అభయమొసంగుమా! వరదాతా, గణనాధా! "వినా" చరణం : గణ నాయకత్వముకై పరీక్షించిన మాతాపితరుల ప్రదక్షిణముతో "2" భక్తిశ్రద్ధలను చాటితివయ్య, నీవు "2" అగ్రతాంబూలమంది, గెలిచితివి గణనాధా! "వినా"
76.
Vrelupatti 04:17
వ్రేలుపట్టి పల్లవి : వ్రేలుపట్టి, నడిపించెడి దైవము వెనుకకు మరలి, యోచించని దైవము [2] అ.ప. : ఎల్ల తావుల, నిండిన దైవము ఎల్ల త్రోవల, యుండెడి దైవము [వ్రేలు] [2] చరణం : దుర్జనుల మనముల నిండిన దైవము సజ్జనులపాలి, చల్లని దైవము [2] ముజ్జగములకు, మూలము దైవము మునిగణములకు, ముంగిటి దైవము [వ్రేలు] చరణం : ముడుల త్రోవలలోన, విడుపుల దైవము లోగిళ్ళలో, ముక్తి దోసిళ్ళ దైవము [2] దీనుల పాలిటి, ఆది దైవము ఆధీన మగుదుము, అతడికి మనము [వ్రేలు]
77.
ఏమని వర్ణింతు పల్లవి : ఏమని వర్ణింతు, నిను నే నేమని వర్ణింతు "2" అ.ప : జగతి అంతయు నీవైతే ఏమని వర్ణింతు "ఏమని"2" చరణం : కిన్నెర, కింపురుషులు నిను నుతియింప కొలువైనారమ్మా! హిమగిరితనయా, సుందరసుమముల పూజింతుములెమ్మా కళ కళగను నీ కాంతులీనెడు, కరుణ చిందు మోము కల్యాణీ, ఘన సౌందర్య రాశీ! దాక్షాయణి నీవు "ఏమని" చరణం : బాలాంబిక నీ అద్భుత లీలలు కని, తరియింతుమమ్మా! నీ దరహాసం, మమ్ముల బ్రోచే కరుణామృతమమ్మా సిరి సిరి మువ్వల శుభ చరణీ, సింధూరపుతిలకే పిలిచిన పలికెడి బంగరు తల్లీ పూజలు గైకొనవే "ఏమని"
78.
ఎరుగనైతిని పల్లవి : ఎరుగనైతిని, కడకు నేనెవరినని "2" నీ చేతయు నేనని, నీ సృష్టియును నేనని ఎరుగనైతిని, ఎరుగనైతిని, ఎరుగనైతిని, ప్రభూ! "ఎరుగ" చరణం : "నాది" యని, నే దానము సేయగ ధర్మము సేయ, నేనెవరిని తండ్రీ! "2" "నీది" అంతయు "నాది" యని తలచుచు "2" సంబరపడుదునే! సర్వాత్మా! "ఎరుగ" చరణం : వేడుకలందున నా ఘనతేయని సంతసమంతా, నా సొంతమనుకొంటి "2" ఓర్వగలేని పెను ఇక్కట్లు కలిగిన "2" నాకర్మ ఫలమని తలువజాలా! "ఎరుగ" చరణం : ఆత్మలోన పరమాత్మ యుండునని జీవితమంతా సత్కర్మలకేనని "2" తెలిసి, నే గన్నులు, తెరచితిని, స్వామీ! "2" నమ్మితి, నీసేవ కొరకే నేనని "ఎరుగ"
79.
ఎరుగ సాధ్యమా పల్లవి : ఎరుగ సాధ్యమా! యిహమున మర్మము పరమాత్ముడొక్కడే, పాడియగు ధర్మము [ఎరుగ] చరణం : నడయాడుభువిలోన,మనుజులుపలువిధముల నడయాడు నొక్కడే, నిజము, నిధానం [2] వెరసి, వృక్ష చరములు యెన్నియొ, నెలకొనె సుందరభువిపైన, అన్నిటనున్నాడు [ఎరుగ] చరణం : అఖిల లోకముల, హితమును, గోరును, సకలాత్ముడు పలులోకుల గమనము, సరిజేయును, అతడు అన్నింటను గొలువున్నది, అతడే, అతడే, జగమంతా నిండెను, శ్రీ వేంకటరమణుడు [ఎరుగ]
80.
Yugamulu 03:29
యుగములు పల్లవి : యుగములు, కాలగతులు మారినను "2" నగధరుడేస్థిరము, ఇదినిజము "యుగములు"2" చరణం : చరితలు, కాలగర్భమున కలసినను "2" చరితాత్ముడే నిజమగు నిత్యము "2" మనుజులు, కాలగమనమున మారినను "2" మహితాత్ముడే, మహిలోనతధ్యము "యుగములు" చరణం : ఈతడి సమమగు,దైవమును కనలేము "2" సమసి పోని, నిధియు నిధానము "2" సమపాలకుడు, సరసిజనయనుడు "2" సాగరశయనుడు, సర్వాత్వకుడును “యుగములు"

about

Sudhanva Sankirtanam is a Devotional Album written by Lakshmi Valli Devi Bijibilla. Music composed by Kanakesh Rathod. Recorded at 'S' rec.in Hyderabad, Telangana State, India. Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod. Publisher : Bijibilla Rama Rao : Presented by Bijibilla Foundation.

credits

released July 27, 2019

Singers : Vishnu Priya : Siri : Vijayalxmi : Laxmi Gayathri : Madhavi Bijibilla : Sarada Sai : Tulasi : Bala Sahithi : Raman Rathod : Neeraj : Kanakesh Rathod : Music : Kanakesh Rathod : Lyrics : Lakshmi Valli Devi Bijibilla

license

all rights reserved

tags

about

Lakshmi Valli Devi Bijibilla Hyderabad, India

Lakshmi Valli Devi Bijibilla : Born on 18 February 1961. Parents Brahmasri Ravipati Bala Gurunadha Sarma and Smt. Thripura Sundari.Schooled at Madapati Hanumantha Rao Girls High School, Narayanaguda, Hyderabad, Telangana State, India. Married Sri Bijibilla Rama Rao in 1979 at Thirumala Hills with blessings of Lord Balaji. Blessed with three female children. Presented by Bijibilla Foundation. ... more

contact / help

Contact Lakshmi Valli Devi Bijibilla

Streaming and
Download help

Report this album or account

If you like Lakshmi Valli Devi Bijibilla, you may also like: