Sudhanva Sankirtanam 2021

by Lakshmi Valli Devi Bijibilla

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $7 USD  or more

     

1.
చల్లని దేవుడు "పల్లవి": చల్లని దేవుడు బహు చక్కని దేవుడు అల విష్ణుదేవుడు అందరి దేవుడు "చల్లని" "2" "చరణం": తొలిదేవుడు తాను మలి దేవుడూ తాను మహిమలు జూపి మహిని గాచేను "2" మహి మనోహరుడు మహితాత్ముడు తాను మహిలోన వేరొకని వెతుకగ కనలేము "చల్లని" "2" "చరణం": మాయామర్మములు ఎరుగడుతాను మాయను తొలగించే మర్మము జేయును "2" మానస విభుడు సఖుడు మనసుల నెలవుండు మాయాచోరుడు అందరి దేవుడు "చల్లని" "2" "చరణం": సాయుజ్యము నిచ్చే సరసిజనయనుడు సహవాసము జేసిన సంకటహరుడు "2" సన్నిధి మనపాలిటి పాశ విముక్తుడు తన చల్లని చూపే ఎనలేని దీప్తి "చల్లని" "2"
2.
Enno Janmala 06:05
ఎన్నో జన్మల పుణ్యఫలం "పల్లవి": ఎన్నో జన్మల పుణ్యఫలం, అది అన్ని జన్మలకు ఆధారము "2" "అ.ప.": అన్నిట మించిన సంపద దొరికెను అనన్యమైనది అపురూపమైనదిను "2" "ఎన్నో" "చరణం": శ్రీహరి కీర్తనము అదియే పరమపదము చేరువ తీరము జేయు పద నర్తనము పరంధాముని నామమే మన సామీప్యధామము పరమపావనము శ్రవణం దోషరహితము "ఎన్నో" "చరణం": హరిని జేర్చెడు పదమే పదము హరిని స్మరియించు స్మరణమే స్మరణం హరిని స్తుతియించు స్తోత్రమే స్తోత్రము హరిని మతియించు మనమే మనము "ఎన్నో" "చరణం": గతిని దెలిపే శ్రీహరి మతము మతిని పెంచే హరిధ్యానము ధ్యానము హరియైతే ఆద్యంత్యమును కమనీయము కడు రమణీయము "ఎన్నో"
3.
గోపాల బాలకృష్ణా "పల్లవి" : గోపాల బాలకృష్ణా నందలాలా! గోపికాలోల కృష్ణా నందలాలా! “2” "అ.ప." : గోవర్ధనోద్ధార నందలాలా! గోపహృదయ విహారా నందలాలా! “2” "గోపాల" "చరణం" : నీ పాదకమలం శ్రీ నందలాలా! మా పాలి శరణం శ్రీ నందలాలా! "2" బృందావన బాల శ్రీ నందలాలా! మందార పూజిత శ్రీ నందలాలా! "గోపాల" "చరణం" : వేణుగానలోల శ్రీ నందబాలా! ఫణిక్రీడలీల మా నందబాలా! "2" నీ చూపుసోకిన శ్రీ నందబాలా! మా పాపం పావన శ్రీ నందబాలా! "గోపాల" "చరణం" : కృష్ణా నీ కరద్వయము నందలాలా! మా పాలి వరదా భయం నందలాలా! "2" కన్నా! నీ కౌస్తుభం నందలాలా! మా పాలి జ్ఞానదీపం నందలాలా! "గోపాల" "చరణం" : సిరిసిరిమువ్వల పాదం నందలాలా! రివ్వురివ్వున మా భాగ్యం నందలాలా! "2" కృష్ణా నీ దర్శనము నందలాలా! మా పాలి మోక్షద్వారం నందలాలా! "గోపాల"
4.
Nandakama 03:11
నందకమా "పల్లవి" : నందకమా! దివ్య నందకమా! ఆనందుని కరమున మెరిసెడి విధేయ ఖడ్గమా! "2" "చరణం" : అసురుల దునిమేటి కరవాలమా! సురల పాలిటి అమేయ వరమా! “2” అఖిల లోకములేలేటి లోకనాయకుడు హరీ! "2" దక్షిణ హస్తమున ధరియించు ఆభరణమా! "నందకమా" "2" "చరణం" : వెలలేని కీర్తనల వేంకటాపతిని కీర్తించిన ఆ పదకవితామహుని జనన కారకమా! “2” హరి నందకము ఘన పాపనాశనము ఆ పదకవితుని కీర్తన నర్తించు ఆధ్యాత్మికపధమున"నందకమా"
5.
Padma Mukhi 05:24
పద్మముఖీ "పల్లవి": పద్మముఖీ అలమేల్మంగ పుష్పయాగము పద్మనయనునీ రమణికి పుష్పయాగము "2" "అ.ప.": పదునారు కళల తల్లికి పుష్పయాగము పదునాల్గు భువనములు వీక్షించు తరుణము "పద్మ" "చరణం": పద్మముఖి శోభిని పద్మ సరోవరిణి పద్మనాభుని వలచిన పద్మసుందరీ! నీ పాదపద్మములు పూజింతుమే తల్లీ! మా పాదద్వయము నిను అనుసరించునే జననీ! "పద్మ" "చరణం": భాస్కరుని కిరణముల వికసించును పద్మము! ఆ పద్మమునే తలదన్నే నీ ముఖారవిందము పద్మములకు సరివిరులు ఏమి ఇలను లేవులే! మీ ఉభయులకు ఏ జోడి సరితూగలేదులే! "పద్మ"
6.
ప్రతి నరుని హృదిలోన "పల్లవి" ప్రతి నరుని హృదిలోన నీ ధ్యానమే! ప్రతి ధాన్య రాశిన నీ నామమే! "2" "అ.ప." : పారు సెలయేరున నీ వేగమే! కరుణాంబుధీ! ప్రతి మూలము నీవేలే! "2" "ప్రతి" "చరణం" : పచ్చని తరువున నీ వుదయమే! అరవిచ్చిన విరిలోన దరహాసమే! "2" పుడమి కణమున నీ వుందువే! "2" అడవి అణువణువున నీ డెందమే! "ప్రతి" "చరణం" : తాత బోసి నవ్వున నీ వుందువు మా వ్రాత మారుటనూ నీ వుందువు! ఏ "2" వ్రాత వ్రాయను ఏమని పొగడను! ఆ విధివ్రాతనే మార్చు ఓ మధుసూధనా! "ప్రతి" "చరణం" : వెన్నెలలు వెదజల్లు చంద్రబింబము వేడిమి విరజిమ్ము సూర్యగోళము "2" నీలాకాశమున వెలుగు తారాపధమునూ తలదన్నే ఓ చంద్రార్కశోభితా! "ప్రతి"
7.
Rathamuna 04:41
రధమున గూర్చుండె "పల్లవి": రధమున గూర్చుండె రంగనాధుడు వైకుంఠధాముడు ధరణి పావనమాయెను మురిసిపోయెను పులకిత ఆయెను "రధమున" “2” "చరణం": భీరువును జేయును ధీరువుగా తాను ఆధరువూ తానై అన్నింటను తానవును “2” సజ్జనులను వదలడు దుర్జనులను వీడడు సజ్జనులను జేయువరకు నిద్దుర బోడు "రధమున" "చరణం": తర్జన భర్జనకు తాను ఎన్నటికీ లొంగడు, తనను త్యజించిన వారినే తను ప్రీతినొందును “2” మెట్టను సైతం మాగాణి జేయును మొక్కగ యుండియే తాను మానునైన వంచును "రధమున" "చరణం": రేణువునైనను తాను ప్రాణువుగా జేయును వేణువుకైనను తాను ప్రాణంబు బోయును “2” స్థాణువునైనను తాను జీవునిగా జేయును, ఆ జీవునికే తాను జీవనగామి యగును "రధమున"
8.
త్రేతాయుగమున "పల్లవి" : త్రేతాయుగమున నవమి తిధిలోన దశరధుని తనయుడై జనియించిన రామయ్యా! "2" "అ.ప." : మముబ్రోవగ రావయ్యా! రామయ్యా! "త్రేతా" "2" "చరణం": నాలుగు యుగముల వోలెను యిలను నలుగురు సోదరులు మీరును "2" నాలుగు పాదాల ధర్మము గాచుటకును నలుగురుగా నీవే అవతరించినావనును "2" "త్రేతా" "చరణం": నాలుగు వేదాల వోలెను జగమున నలుగురి మాటైనను ఒక్కటేనయా! "2" నలుగురు కలసిన చోటల్ల మీ వూసేనయా! నలుగురిలో నాలుకవలె మెలగినారయా! "త్రేతా" "2" "చరణం": నాలుగు కాలాల పాటు మమ్ములను చల్లగ వుండమని దీవించ రావయ్యా! "2" నలుగురితో నీ కల్యాణవేడుకను నలుమూలల నిధిలా కోరితివయ్యా! "త్రేతా"
9.
వేంకటాచలపతీ "పల్లవి" : వేంకటాచలపతీ వేయి వేయి దండాలు! సంకటహరునికి వేయినామాల స్వామికీ "వేంకటా" "అ.ప." : నామాలు వేలున్నను ఒక్కటే నామము దైవాలు ఎన్నున్నను నీవేలే మాదైవము "వేంకటా" "చరణం" : అకటా! ఏమి? ఈ మానుష జన్మము ఒకటా? రెండా? ఎన్నో వేల జన్మములు "2" యే ఒక్కటి ఐనను కామిత రహితమా! ఈ ఒక్కని తలచిన మోక్షద్వారమేగా! "వేంకటా" "చరణం" : ఏ పువ్వు విచ్చిన, ఆ రోజే అంత్యము మానుష జన్మానికి లేదు ఏ అంతము పువ్వునకు జన్మకును బేధము అనంతము పువ్వుజేసె పుణ్యము అలస్వామి పాదాక్రాంతము "వేంకటా" “చరణం" : మానవజననమే అర్ధము పరమార్ధము మానవునిగా నీవు సాధించుము సర్వము సార్ధకము జేయుము మానుషజన్మము లీలామానుషము, వేంకటరమణము "వేంకటా"
10.
విశ్వము నీవే "పల్లవి" : విశ్వము నీవే! విశ్వాసము నీవే! విశ్వమంతయును వ్యాపించినావే! "విశ్వము" “2” "చరణం" : విశ్వములోని వాయువు నీవే! ఆ వాయువులో నున్న ఆయువు నీవే! “2” ఆయువులోని పరమాణువు నీవేలే! ఆత్మవు నీవేలే పరమాత్మ వైనావు "విశ్వము" “2” "చరణం" : ప్రాణులలోనున్న జీవము నీవేలే! ఆలన పాలన పరిపాలన నీవేలే! “2” పరమాత్మ లేనిదే జీవాత్మ లేదులే! జీవాత్మ పరమాత్మ బంధము తిరములే! "విశ్వము" “2” "చరణం" : ప్రాణులలోనున్న భావన నీవే! భావము భాగ్యము అన్నియును నీవే! “2” భావనారాయణుడా! బంధవిమోచనుడా! మా బాగును గాచు భాగవతోత్తమా! "విశ్వము" “2”

credits

released August 31, 2021

license

all rights reserved

tags

about

Lakshmi Valli Devi Bijibilla Hyderabad, India

Lakshmi Valli Devi Bijibilla : Born on 18 February 1961. Parents Brahmasri Ravipati Bala Gurunadha Sarma and Smt. Thripura Sundari.Schooled at Madapati Hanumantha Rao Girls High School, Narayanaguda, Hyderabad, Telangana State, India. Married Sri Bijibilla Rama Rao in 1979 at Thirumala Hills with blessings of Lord Balaji. Blessed with three female children. Presented by Bijibilla Foundation. ... more

contact / help

Contact Lakshmi Valli Devi Bijibilla

Streaming and
Download help

Report this album or account

If you like Lakshmi Valli Devi Bijibilla, you may also like: