Sudhanva Sankirtanam 2020

by Lakshmi Valli Devi Bijibilla

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $5 USD  or more

     

1.
Aasthanamulu 05:13
ఆస్థానములు "పల్లవి" : ఆస్థానములు దేనికి ఘన సంస్థానములు దేనికి స్థానము కలిపించిన మరి మనసున చాలును "2" "చరణం" : సంస్థాపకుడు తానైన మరి స్థానబలము దేనికి అష్టదిక్కులూ తానైన మరి అన్యదిక్కు దేనికి అనాది నుండి పునాది తానే యీ జగతికి భక్తి మెట్టు పేర్చిన మరి ముక్తి ప్రవేశమే నరునికి "ఆస్థానములు" "చరణం" : సింహద్వారము తానైన గృహప్రవేశయోచన దేనికి సింహబలుడే ముంగిలి యున్న సింహావలోకనముండదు! ఆదరము సాదరము తానేలే జగతికి ఆద్యంత్యరహితుడు, ఆద్యంత్య వ్యాప్తుడును "ఆస్థానములు" "చరణం" : భవసాగరము దాటే నౌకయే తానంట, ఆ నౌకను నడిపే నాయకుడే తానంట ముంచు అలలు ఎన్నున్న సుడిగుండాలెనైన నీ సుడి దిరుగునటుల నావ నడిపించును "ఆస్థానములు"
2.
Atthivarada 04:40
అత్తి వరదరాజస్వామి "పల్లవి" : అత్తి వరదరాజస్వామి పెరుమాళ్ళు వందనం, నీవు ఉత్తుత్తిగ యీయవుగా లెక్కకు మించిన వరములు "2" "అ.ప." : ఒత్తి ఒత్తి పలికిన నీ నామ మహిమ గరిమను పత్తిత్తులకైననూ వారి పంట పండును "అత్తి" "చరణం" : సత్యము నీవు గాక యింకెవరున్నారు! నిత్యము నీ మహిమలు మనసారా గాతుము! నిత్య సత్యములు నీవు పంచిన, పరమాన్నముగా! అసత్య భాషణముల స్వామి సంతృప్తి చెందవుగా! "అత్తి" "చరణం" : అత్తి వృక్ష రాజమే నీ ఆకారము దాల్చెనుగా! అత్తి వృక్షమే యిల ఘన పూజలందుకొనెనుగా! స్థలాభోగ శిలాభోగ మైనను నీ మహిమేగా! స్థల శిలా భోగముల నెలవుందువు నీవేగా! "అత్తి"
3.
బంగారు పాదాల "పల్లవి" : బంగారు పాదాల పాద పద్మారాధన శృంగార రాయనికి స్వర్ణ పుష్పార్చన "2" "చరణం" : అంగరంగ వైభవాల సహస్రనామార్చన రంగురంగు సంర్రంభాల స్వరార్చ నామాల “2” రంగనాయకునకు అల బ్రహ్మదేవుని రంగారు సింగారాల బంగారు అర్చన "బంగారు" "చరణం" : అంగ అంగాంగ శోభ బహు యింపారు శోభ ఘన సారంగపాణికి సౌమ్యమైన శోభ సురాంగణల గానాల సుస్వరాల శోభ సురలోక నాయకునకు సుప్రభాత శోభ "బంగారు" "చరణం" : అభ్యంగ స్నానాల అసమాన సమావర్త అభిజిత్ ముహూర్తాన అందుకోవా మా జోత “2” అచ్చెరువొందే సేవల కొండల కోనేటిరాయా! సచ్చరితుల పాలి నీవు సత్యదేవుడవయ్యా! "బంగారు"
4.
Damodarude 04:17
దామోదరుడే "పల్లవి" : దామోదరుడే ధరణిని గాచేను యిలలోన తామసము తరిమిగొట్టును "దామోదరుడే" "చరణం" : పావనమైన పాదద్వయము తాకిన జాలును పారవశ్యము సాయుజ్యము నిచ్చు సాకారుడు ఆకాశమునిండి అనంతుడై ఇలవెలసినాడు "దామోదరుడే" "చరణం" : ఏమైనను మరి దామోదరుడే సకలలోకపతి తరచికానగను “2” అఖిల లోకముల ఏకనాయకుడు అఖిల చరితముల చరితార్ధుడు హరీ! "దామోదరుడే" "చరణం" : ఆజ్యము లేనిదే దీపము వెలుగదు, సాన్నిధ్యమేలేని, జీవము మనదు అవ్యాజ కరుణల కరుణామయుడు దివ్య మహిమల మహిమోపేతుడు హరీ! "దామోదరుడే"
5.
Manasu Ane 05:10
మనసు అనే "పల్లవి" : మనసు అనే తాళంచెవి నీవద్ద యున్నపుడు నీ హృదయమను గృహము యిక మూసివేయబడదులే! "2" "అ.ప." : చోరులు మరి దుండగులను చెడుయోచనలు పట్టివేయమని నీ మనసు హెచ్చరించును "మనసు" "చరణం" : కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యము ఆమనిలా నిన్ను అడగకుండ ప్రవేశము సందేహమను తలుపులను తీసిమూసివేయును తికమకలు చేయును ముంచివేయు తింగరినీ జేయును "మనసు" "చరణం" : చోరులు ఎందరు చుట్టిన నీ హృదయము మరి భద్రము చరాచరునికే మిత్రమా! స్వాగతము పలుకుము చాలును ఆ విభునికి నీ హృదయమనే గృహము హృదయప్రాకారానికి తానే ఆదియునంత్యము "మనసు"
6.
మీ సంతోషమే "పల్లవి" : మీ సంతోషమే నాకు సంతసము మీకును నాకును గలదు విడదీయరాని బంధము "2" “చరణం" : తల్లి వడిలోని బిడ్డలవలె నాకు, మీరు లాలించే తల్లి నేను నా లోకమే మీరు దండించే మనసులో ప్రేమఅనే యేరుపారు బంధముతో మనసునే చుట్టి వేయు మేరుతీరు "మీ" "చరణం" : మీ ఉన్నతి గోరులే నా మనంబు ఎన్నడును శిష్టులు దుష్టులను బేధమేల కానగలను సామ దాన బేధ దండోపాయముల నేను మీ బాగోగులనే గోరు, కలవర పడుదు నిరతము నేను "మీ" "చరణం" : దేవ దేవుని వినతిని వినుమా! మానవా! ఓ సుమతీ! పొందవలె నీవు ఎనలేని సద్గతి మతిమాలి విడువకుమా నీవు దేవుని జతి మరువకుము మనమందరము ఆ దేవుని సంతతి "మీ"
7.
Naa Manasame 05:40
నా మానసమే "పల్లవి" : నా మానసమే వూయల, పసిపాపడవై వూగేవు ఆడుతు పాడుతు తిరిగినను పరవశింపజేశేవు "2' "చరణం" : నీ బోసినవ్వులు నను మైమరపించే ఆకలిదప్పులు గురుతు సేయబోవులే! నీ కిలకిలల అమృతమే నా దప్పికను దీర్చునులే! నీ పలుకుల పరమాన్నం నాకడుపును నింపునులే "నా మనసే" "చరణం" : నీ అడుగు తడబాటే నను సరిజేయునులే! నీ వురుకు పరుగులే నా యోచనలే! నీ లేత జేవేళు అర్చింప చిహ్నములే! “2” నీ పవళింపు స్థానమే నా వైకుంఠధామమే "నా మనసే" "చరణం" : నీ తొలిఅడుగు ఆకాశమంత ఆనందం నీ మలిఅడుగు పుడమియే పులకితము నీ అడుగులా నా అడుగు ఆనందం “2” ఆనందనందనా! నా ప్రతిఅడుగు నీ మయమే "నా మనసే"
8.
రాయిలోన నీవే "పల్లవి" : రాయిలోన నీవే, ప్రతిస్థాయిలోను నీవే వేయినామాల స్వామి! రేయ్యింబవళులు నీవే! "2" "చరణం" : కొండలలో నీవే, మా డెందములో నీవే! కొండలనన్నింటిలోన ఏడుకొండలు నీవే! ఫలములలో నీవే, ప్రతిఫలమైనను నీవే! ఫలసముదాయములలో తియ్యందనము నీవే! "రాయిలోన" "చరణం" : రేణువులో నీవే! వేణువులో నీవే! ప్రాణాధారమైన నీరములో నీవే అంతరాత్మలలో అమృతము నీవే! ఆత్మజ్యోతివి నీవే, అంతర్యామివి నీవే! "రాయిలోన" "చరణం" : తరువులలో నీవే! ప్రతి మేరువులో నీవే! మేరువులన్నింటిలోన వేంకట మేరువుయొకటే! జీవులలో నీవే! చిరంజీవివైనావే! పరంజ్యోతిగా వెలిగే పరంధాముడవు నీవే! "రాయిలోన"
9.
సామాన్యుడు గాడులే "పల్లవి": సామాన్యుడు గాడులే! వీడు మాన్యుడే! "అ.ప.": అసామాన్య మహిమల ఆశ్రితమంజులుడే! "చరణం":సాధారణ మనిషిని మనీషిగా సేయునులే! అసాధారణముగా ఆతని మదిలోన నిలుపునులే! ఆదరణ సాదరణ తానుగా నిలుచునులే! ఆద్యంత్యము తానై మనలను నడిపించునులే! "సామాన్యుడు" "చరణం": కారణము తానే మరి కారకము తానే! కారణము తానైనను మిగుల మిన్నకుండునులే! శొధన, సాధనతో జగతిని నడిపించునులే! సాయుజ్యము తానై సాయమందించునులే! "సామాన్యుడు" "చరణం": కలియుగమున వెలసినాడు కలిమలహరుడే వీడు కలకాలము మనల వెన్నంటి నడిపించువాడు చలచల్లని మలయాచల మలయప్పయే వీడు అల్లన మెల్లన యుల్లము నిండుగ నుండెడు ఱేడు "సామాన్యుడు"
10.
శ్రీరామనవమి "పల్లవి" : శ్రీరామనవమి శ్రీరామ పుణ్యనవమి తామసములు కామితములు దీర్చే కోదండరాముని "2" "చరణం" : త్రేతాయుగమున వెలసే విష్ణువు దశరధుని తనయునిగా విష్ణువు మువ్వురు సోదరుల అగ్రజుడై వెలసే మువ్వురు మాతల బిడ్డడై మురిసే! "శ్రీరామ" "చరణం" : బండరాళ్ళు సైతం నీటిపై తేలే బండవంటి హృదయాలు నీరై మరి కరిగే “2” బండలు తామే మరి రామాయని పలికే దుండగుడు మారెనులే! అందని కవి ఆయనులే! "శ్రీరామ" "చరణం" : ఎల్లలోకదైవము మరి తానై నిలిచెనులే వొల్లనిదేదైనను సేయకూడదనిలే! “2” ఎల్లరకు మార్గదర్శి తాను గాక ఎవరులే! శ్రీవల్లీనుత చరణా, హరిగాక ఎవరులే! "శ్రీరామ"
11.
యజ్ఞము నీవే "పల్లవి" : యజ్ఞము నీవే కర్తవు నీవే! అజ్ఞానము తొలగించే ఆత్మవు నీవే! "2" "చరణం" : ఆజ్ఞవు నీవే ఆర్ధ్రత నీవే విజ్ఞానము నీవే వివిరణ నీవే సుజ్ఞానులకు సమభావన నీవే జిజ్ఞాసులమై నిన్ను అనుసరింతుములే "యజ్ఞము" "చరణం" : అజ్ఞానులకు అంతర్యామివే పరిజ్ఞానులకు పరమాత్మవు నీవే! “2” పరజ్ఞానము నీవే పరంధామవు నీవే! నీ ఆజ్ఞానుసారము అనుసరింతుములే! "యజ్ఞము" "చరణం" : భుక్తివి నీవే భోక్తవు నీవే భక్తిమార్గమున గమ్యము నీవే “2” ఆర్తితో మమ్ములను ఆదరింతువులే! పరమాత్మా నీకే మానస హారతిలే! "యజ్ఞము"
12.
ఆనందం నీవేలే! "పల్లవి" : ఆనందం నీవేలే! అద్భుతమైనావులే! ఆనంద లోకాల అపురూప కాంతివిలే! "2" అ.ప." : నీ కన్నుల కాంతిలోన పయనించే వారలము నీ గాలిసోకిన మనసు ఆనంద పరవశము "ఆనందం" "చరణం" : నీ కొండలపైన పాదం నే మోపగనే నా అండ నీవనే భావమే గల్గెనులే! (భావనయే) నా గుండె సవ్వడియే గుడిగంట ఆయనులే! “2” నా డెందము పులకితయై నవ నవోదయమాయెనులే! "ఆనందం" "చరణం" : నవోదయపు అరుణిమయె తిరునామమై మెరసెనులే! నీ సుందర రూపమే నా హృదిలోన నిలచెనులే! అందమైన అనుభూతియె ఆనంద నిలయమాయెనులే! ఆనందనిలయమే తిరువేంకటపురమాయెనులే! "ఆనందం"
13.
అంగ రంగ వైభవం "పల్లవి" : అంగ రంగ వైభవం రంగనాధునీ ఉత్సవం "2" "శ్రీ" జగమంతా వీక్షణం మనసంతా వుత్సాహం "2" "అంగ" "చరణం" : ఏడురోజులు సాగే ఘనమైన వుత్సవం ఏడేడు లోకములు వీక్షించే సంబరం “2” ఏడేడు జన్మలు ముక్తినొసగు సంరంభం ఏడుకాలాలు తిరముండు వుత్సవం "అంగ" "చరణం" : ఆనందం అద్భుతము మిళితమీ వుత్సవం రంగనాధోత్సవం యిల బంగారు వుత్సవం స్వర్గమే యిలపైన దిగునటుల వుత్సవం కలనైనను కనివినీ ఎరుగనీ వుత్సాహం, ఆశ్ఛర్యం "అంగ" "చరణం" : ప్రతిమాఘమున జరుగును రంగని బ్రహ్మోత్సవం ఆఘమేఘములపైన జనులు తరలు వుత్సవం రంగనాధుడే మేఘము జనుల మనసు క్షేత్రము కను జూపే జల్లు మనకు మోక్షమే విత్తనము "అంగ"
14.
ఆరోగ్యము ఆనందము "పల్లవి" : ఆరోగ్యము ఆనందము అర్కుని మరి సేవించిన ఆయుషు, ఐశ్వర్యం అర్కుని మరి అర్చించిన "2" "చరణం" : ఏడు అశ్వములపై విహరించే భాస్కరుడు ఏడు లోకాలలో విహరించే ప్రభాకరుడు ఏడు నదుల సంగమము కలిగించు ఆదిత్యుడు ఏడవ తిధిలో మరి విహరించే దినకరుడు "ఆరోగ్యము" "చరణం" : దినకరుడు లేనిదే సృష్టి అసలు లేదులే! సృష్టి లేనిదే మనము మనమను వారము కాములే!! సృష్టి కారకుడు యీ సూర్యభగవానుడైతే! స్థితి కారకుడు ఆ శ్రీమన్నారయణుడే "ఆరోగ్యము" "చరణం" : ఆరోగ్యము కలిగియున్న అదే మహాభాగ్యము, ఆ భాగ్యము మనకిచ్చును, అఖిల జగ మార్తాండుడు ఇనకులపు చిహ్నమై నిలచినాడు కిరణ్మయుడు ఇనవంశపు దీపమై వెలిగినాడు రఘురాముడు "ఆరోగ్యము"
15.
Intidonganu 04:17
ఇంటిదొంగను "పల్లవి" : ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడట, ఆ ఇంటిదొంగను పట్టించే ఈశ్వరుడే తానంట "2" "అ.ప." : ఒంటిలోని మాలిన్యమును తొలగించే ఔషధమంట మన ఇంటిలోని మాధుర్యమును తొలగనివ్వని సౌరభమంట "ఇంటి" "చరణం" : సకల పోషణ కారణము నిక్కముగా నీ మనసేనంట సకల మానసవికాసము ఆధారమె నీ మనసంట ఆలోచనలను వెల్లువకు ఆనకట్ట నీ యోచనయంట ఆనకట్టలేని నీ మనసే అనర్ధములకు వారధియంట "ఇంటి" "చరణం" : మోక్షగామిగా మననినాడు బ్రతుకే యిక భీతియంట భక్తియను వారధిని జేసుకొనుటయే రీతియంట “2” మనసను కళ్ళెము నీ కరముననే యుండునంట అల మాధవుడను మత్తేభము నీ కళ్ళెము నాపునంట "ఇంటి"
16.
Kundapothaga 04:46
కుండపోతగా "పల్లవి" : కుండపోతగా వానలు గురిసిన కొండలరాయుడే చిరుజల్లు బండబారిన హృదయమందును భావములను మొలకెత్తించు "2" "చరణం" : చిల్లులుపడిన ఆకాశమును ఛత్రమువలె తను కాపాడు గొల్లపిల్లడే గోవర్ధనముతో గోకులమంతయు గాపాడే ఒక్కపదముతో భూమియంతయు అంతయు తానై ఆవరించెను బక్క బాపడే బలి భూపతిని పాతాళమునకు పంపివేసెను "కుండపోత" "చరణం" : గాలిరూపమున గోవర్ధనుడు శరీరమంతా పులకరింపెను ఆలిగ శ్రీమతి శ్రీమహాలక్ష్మిని హృదయమునందే నిలుపుకొనెనులే! భాస్కరుడే మరి చిరుదివ్వెవలె లోకమంతయును వెలుగునిచ్చును అర్కుడైననూ భూసురపతి ఘన చాయలే తన వెలుగులాయలే "కుండపోత" "చరణం" : సర్వలోకములు ఏలెడువాడు సర్వోత్తముడే, ఇంకెవరు సర్వము తానై పరము నిచ్చును, సామీప్యము మరి తానేలే సర్వాయుధుడు శుభకరుడు హరి, యుగపురుషుడు మరి తానేలే! సర్వసంపదల మన వడి నింపు సర్వస్వము యిక తానేలే! "కుండపోత"
17.
మనసు అనే ఉద్యానవనమున "పల్లవి" : మనసు అనే ఉద్యాన వనమున, యిల "మనిషి" యనే తోటమాలి యొకడు "2" "అ.ప." : అక్షరమను విత్తనములు జల్లెను "2" అవి మాటలుగా మొలకెత్తెను సంతసమొందెను "మనసు" "చరణం": మాటలను తెచ్చెను, మూటలను గట్టెను ఏమిచేయాలో తనకు తోచదాయెను "2" మంచిమాటలతొ మనము మంచిని పంచవలెను మంచిధాన్యముగనవి ఉపయోగము గావలెను మనసు" "చరణం" : క్షేత్రమను లోకమున పరమాత్ముని గాంచుమా! ధాన్యమను పదములను యాతని కంకితమీయుమా! కీర్తన యను ధాన్యరాశితో నీవు వండుమా! ఆ దేవదేవునికి తృప్తిగ కడుపు నింపుమా! "మనసు" చరణం" : నగధరుని ఆజ్ఞ లేని నగుమోము గానము, ఆతడి అనుజ్ఞలేని జన్మము కానగ కాననము “2” మహిమోపేతములే మహీధరుని మహిమలు మోహనాశములు, అతడు కురిపించు నగవులు "మనసు"
18.
పారిజాతము నీడలో "పల్లవి" : పారిజాతము నీడలో పరమాత్ముని సన్నిధిలో పరవశించెను నా మనసే పరిపరివిధముల "2" "చరణం" : ఆ చల్లని కన్నుల ఆనందపుటంచుల తిలకించి పులకరించె అవ్యాజ కరుణల “2” కారుణ్యమూర్తిగా మనమున తోచెనలా కరుణాసాగరమై దేహమంతా తడిపెనలా! "పారిజాతము" "చరణం" : రాధమ్మ నయనాల స్వామి మెరసెను మిల మిల ఆ గొపెమ్మ వెన్నలా స్వామి కరిగెను కరుణల “2” ఈ దేవమ్మ హృదయమే పీఠమై నిలచెనిలా దేవదేవుని కరుణయే జగమంతా చిందెనిలా! "పారిజాతము" "చరణం" : బృందావనమున తరులు బృందమై వూగెనలా! ఆనంద నందనుడే విరితావుల మెరిసెనలా! “2” భక్తి సామ్రాజ్యమే ఏలెను యీ భువినిలా! రారాజై ఆ నగధరుడే లక్ష్మమ్మ నేలెనిలా! "పారిజాతము"
19.
Pasipaapadi 04:32
పసిపాపడి నగవు "పల్లవి" : పసిపాపడి వంటి నగవు పసి నిమ్మపండు నగవు వసివాడని నవ్వు మిసి మిసి రవ్వలు రువ్వు "పసి" "చరణం" : జగముల నేలే నగవు జలతారు వంటినగవు జగన్నాయకుని నగవు జాబిలి నవ్వు “2” జలజనయనుని నగవు జలపాతం నగవు జల జల ముత్యాలు నేల జాలువారు నగవు "పసి" "చరణం" : సర్వ శుభముల నగవు శుభాశీశ్శుల నగవు సూర్య కాంతి నగవు సొంపైన నవ్వు “2” చంద్రుని వంటి నగవు శిశిరకాంతి నగవు శిశుపాలుని మర్దించి లోకము గాచిన నగవు "పసి" "చరణం" : రుక్మిణమ్మ మనము దోచి దోబూచు లాడేనగవు రుక్మి గుండెలలోన గర్జన నగవు “2” రివ్వున విరులే రువ్వు, మెల్లని ఆ నవ్వు అవురా! జగమే గాచే జిగేలుమను నవ్వు " పసి"
20.
Ramalali 05:07
రామలాలీ "పల్లవి" : "రామలాలీ" అనుచు సునయన జోలతోన రాముని తలపులునింపే సీతమ్మ మదిలోన "2" "అ.ప" : రాముని కొరకై మరి జనియించె సీతమ్మ రామాయణమే ఇక ఫలవంతము ధరలోన "రామ" "చరణం" : ఉగ్గుపాలతోడ నిండె ధరణిజ డెందములోన, ఆ రఘువంశ యగ్రజుడే తనవాడను త్రికరణ శుద్ధితోన దిగ్గజమై విహరించెను సీతమ్మ కలలలోన అద్గదిగో విహంగమాయె మానస సరస్సులోన "రామ" "చరణం" : ఏమైననూ యాతడే తనవాడగు రీతిలోన ఆమనిగా వచ్చి తన మనస్సును పువ్వుల నావలోన తీరమునే జేర్చునుగా! తియ్యని బంధముతోన పూతేనెల దారమై అల్లునుగా తనమనసుతోన "రామ"
21.
సాయుజ్యము నీవైతే "పల్లవి" : సాయుజ్యము నీవైతే సాయం మాకెందుకు కైవల్యము నీవైతే కోరికలింకెందుకు "2" "అ.ప." : కోరికల కడలిలోన దిక్చూచివినీవే! అంతుతెలియనీ తీరపు అంచువు నీవే! "సాయు" "చరణం" : సిరిసంపదలు మాకు బ్రతుకుతెరువుకేలే! సిరితోగూడిన నీవు కారుణ్యనిధివేలే! హరీ! “2” రారాజువు నీవైతే పదవులు ఇక మాకెందుకు సామ్రాజ్యము నీదైతే పట్టము మాకెందుకులే "సాయు" "చరణం" : ఆకాశవీధిలోన వెలిగే భాస్కరుడవు నీవె! నీ వెలుగుల కిరణముల విరిసే తామరలు మేము హరీ! “2” తామరాకు మీద జారు నీటిబిందువే నీవు, ఆ బిందువు కొరకై వేచే చకోరమే మేము "సాయు"
22.
ఉడిపి కన్నయ్యా "పల్లవి" : ఉడిపి కన్నయ్యా! గోపాల బాల కృష్ణయ్యా! నిను ఉడుతా భక్తిగ గొలచిన ఉద్దండుల జేతువయా! "ఉడిపి" "చరణం" : వేణుగానలోలుడవు బృందావనమాలినీవు ముద్దులొలుకు బాలుడిగా గోచరించుతావయ్యా పదునాల్గు భువనములు నీ నోట జూపినావుగా నీ పదద్వయమే భువనమును పరము జేసెగా "చరణం": వెన్న చోరుడవు ఘనుడవు మన్ను మీది దేవుడవు! మనసుల గెలిచేవు బహు మాయల దొంగవు నీవు బృందావనమున నీవే, ఆత్మబంధువై నిలచావే! అందాల గోపెమ్మల ముద్దుల కృష్ణుడువే! "ఉడిపి" "చరణం": చిరుగాలుల సవ్వడి నీ చిరునగవులనుకొందుము చిరువానల చప్పుడులే నీ చిలుకపలుకులనుకొందుము మెరుపు కాంతులే నీ కళల మోముఅనుకొందుము వురుముల సవ్వడులే నీ యానతులనుకొందుము "ఉడిపి"
23.
వెన్నంటి ఉండు వాడు "పల్లవి" : వెన్నంటి ఉండు వాడు, వెన్నెల రాయుడు వెన్నవంటి మనసువాడు కోనేటిరాయుడు "2" "చరణం" : ఎన్నెన్నో పుణ్యఫలము, లెన్నెన్నో జన్మఫలము అన్నియును తీరునులే, అంకెలేమి సరిరావులే! అన్నియుగాలలోను ఆతడే దైవములే! నిజములే! మనయోగభాగ్యములే! మనకందినాడులే! "వెన్నంటి" "చరణం" : యుగపురుషుడు ఆయెనులే! మొగమాటములేదులే! మొగలిపొదన ముళ్ళైనను మరుమల్లెలాయనులే! అనిరుద్ధునకు సాటి దైవమే యిలను లేదులే! ఉద్ధరిణి నీరైనను మనలనుద్ధరించువాడులే! "వెన్నంటి" "చరణం": స్థాణువు కైనను లలిత మార్దవ మిచ్చేను చిరాయువు జేయును చిరకాలము నెలవుంచును ఆయువు తానే మన చాయయును తానే కాయము తోనే మనలను పరమపధము చేర్చును""వెన్నంటి"
24.
సెట్టూ పుట్టకు "పల్లవి" : సెట్టూ పుట్టకు కారణమంట సెట్టంత దైవము తానె యంట "2" "అ.ప." : పట్టినపట్టు యిడువడంట మనల పట్టభుధ్రులను సేయునంట "సెట్టూ" "చరణం": ఆడను ఈడను ఆవరించునంట ఆడుతు పాడుతు బతుకమంటడoట “2” ఆడేగా మన తోడు యంట వీడడుగా మరి జనమల సివరగ "సెట్టూ" "చరణం" : మదిలో నుండగ భయము యేలరా! మరి బదులుగ తాను ఏ మడుగడురా! “2” మదముతొ నీవు మాట మీరినను ముదముతొ నిన్ను కడతేర్చునురా! "సెట్టూ" "చరణం": జలజనేత్రి తోడు తానె యంట! జలములొ నెపుడు కొలువుండునంట “2” జలజల కన్నీరు గార్చిన నీవు జాలమువలె నిన్ను అల్లుకొనునుగా! "సెట్టూ" "చరణం": వైకుంఠము మరి యేడొ లేదురా! తాను అంటి యుండునదె వైకుంఠమేరా! “2” జంటగ నీకు వాడు యుండిన ఒంటిరాయివి గానే గాదురా! "సెట్టూ"
25.
అలమేలు మంగమ్మ "పల్లవి" : అలమేలు మంగమ్మ తలపుల నీవమ్మ తలపలోక నిలయవట మా తలపుల వాకిట నీవట "అలమేలు" "చరణం" : పలుకుల తేనెలధారల పదముల మువ్వలు భళిరా! పాలపొంగువోలె నవయవ్వన తారవు ఛాయవు “2” పాలసంద్ర నిలయవు పరువాల వెల్లినీవు పాలముంతల కొలువా పాల పుంతల ఛాయవా! "అలమేలు" "చరణం" : పూలవంటి పరిమళము మేని సొగసు అతివా! తలవంచి సిగ్గుపడు పూల తోటలే మగువా! “2” కిలకిల నగవుల మల్లెలు గుసగుసలాడేనులే! అల్లనల్లన చందురుడే మబ్బులలో దాగెనులే! "అలమేలు" "చరణం" : అచ్యుతుడే నీవాడు అలమేలు మంగమ్మా! మచ్చికతోడనె నీవు మనువాడినావమ్మా! “2” అచ్చెరువందగ నీవు అలమేలు మంగాపురమున నచ్చి వచ్చి నిలచినావు వరముల నిధివైనావు "అలమేలు"

credits

released December 7, 2020

license

all rights reserved

tags

about

Lakshmi Valli Devi Bijibilla Hyderabad, India

Lakshmi Valli Devi Bijibilla : Born on 18 February 1961. Parents Brahmasri Ravipati Bala Gurunadha Sarma and Smt. Thripura Sundari.Schooled at Madapati Hanumantha Rao Girls High School, Narayanaguda, Hyderabad, Telangana State, India. Married Sri Bijibilla Rama Rao in 1979 at Thirumala Hills with blessings of Lord Balaji. Blessed with three female children. Presented by Bijibilla Foundation. ... more

contact / help

Contact Lakshmi Valli Devi Bijibilla

Streaming and
Download help

Report this album or account

If you like Lakshmi Valli Devi Bijibilla, you may also like: