Sudhanva Sankirtanam

by Lakshmi Valli Devi Bijibilla

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $9 USD  or more

     

1.
అచ్చటిచ్చటలేని పల్లవి : అచ్చటిచ్చటలేని, ముచ్చటగురూపము [2] అచ్చెరువొందేటి, లలితలావణ్య, హరీ! అ.ప : మెచ్చునటుల, ఈఅఖిలజగమ్ములు [2] అచ్చముగా, నీవలమేల్మంగపతివి [2] [అచ్చ] చరణం : సచ్చరితులు, నిను ఉచ్ఛరించెడు తీరు సత్య లోకములు, నీవు పాలించెడు తీరు [2] సత్యభావనలలో, నెలవుండుతీరు [2] సత్య వాక్కులయందు, వసియించు తీరు [2] [అచ్చ] చరణం : నిశ్చలముగా, మనసులు కొలచెడు తీరు అష్ట సిరులు, నీవు అందించెడు తీరు [2] అందించి, మమ్ముల నలరించు తీరు [2] అవలీలగా, నీవు కరుణించు తీరు [2] [అచ్చ] చరణం : చిచ్చరపిడుగై దుష్టుల చెండాడెడు తీరు [2] చిద్విలాసా! నీవు తిలకించెడు తీరు [2] అభయ హస్తముతోడ, అలరారు తీరు అఖిల పాపము లెల్ల, రూపుమాపెడు తీరు [2] [అచ్చ]
2.
అఖిలాత్మకా పల్లవి : అఖిలాత్మకా! అఖిలాత్మకా [2] అఖిలరూపమ్ముల, ఆత్మవు, పరమాత్మ [అఖిలా] చరణం : నీ పదములే, మా యిహ పరమ్ములు ఆర్త రక్షణ నీకు, అందెవేసిన చేయి [2] నిగమాగమా! నీ యోగ నిద్రలో [2] జగములు కాచేవు, జగదాధారా! [అఖిలా] చరణం : బ్రహ్మవిద్యలు నేర్వగదుర్లభం నీకృప వుంటే, అవి వెన్నతొ పెట్టు విద్యలే ఓకృపానిధీ! నీకరుణె వుంటే [2] సాధ్యము కానిది ఏమున్నదయ్యా [అఖిలా]
3.
అఖిలాత్మకుడు హరి పల్లవి : అఖిలాత్మకుడు హరి ఇది నిక్కమూ పరమపదమునకు వారధి ఇదినిజము [అఖిలా] [2] చరణం : పెనుసాగరమును ఈదుట బహు కష్టం కారడవులదూరు అతికష్టమూ [2] కఠినాత్ముని మనసు కరగుట దుర్లభం వానిపై కరుణ గురిపించిన శూన్యం [అఖిలా] [2] చరణం : దయాసాగరము బొందుట బహు కష్టం భవసాగరమును ఈదుట గగనము [2] ఆకసమునంచున తిలకించు యత్నము నింగీ నేలల ఏకమూ బహు కష్టం [అఖిలా] [2] చరణం : యోగుల శాపము వెనుదీయుట కష్టము మూర్ఖుల మనసును మలపుట అతి కష్టం [2] మరి తరచి చూచిన మానుష జన్మము [2] పొందుటె దుర్లభం బహు కష్ట తరము [అఖిలా] [2] చరణం : దానవాంతకుడు హరి కరుణ మనపైన యున్నఅన్నియు సుసాధ్య మేనన్నా [2] కనిపించు దుర్గములు పూలదారులై సులభ సాధ్యములు కరతలామలకములు [అఖిలా] [2] చరణం : అచ్యుతానంతుడు గోవిందుడు పరమాత్ముడు ఆ నారాయణుడు [2] ముజ్జగముల నేలు జగదాత్మజునికి [2] జయమంగళం నిత్య శుభమంగళం [అఖిలా] [2]
4.
అలరాముడైననూ పల్లవి : అలరాముడైనను, సరి బాలుడైనను అమ్మ ఒడిలో హాయిగా నిదురబోవు అ.ప : అల దైవమైనను, ఇల మనుజుడైనను ఎంత ఎదిగినను, పసిబాలుడే తాను" జో జో జో "2" "అల" చరణం : పుడమి అయినను, స్వర్ణవూయలే ఐనను పసిపాపలు, నిదురలొ పరవశింతురు మహరాణికైనను, సామాన్య వతికైన కన్న ప్రేమకు కొదవె వుండదు "అల" చరణం : కడుపేదకైన, ధన, భూపతికి ఐనను వాత్సల్యమునకు వారధి వుండదు "2" జున్నుపాలైననూ, కటిక నీరైననూ ఆకలికి బేధమసలుండదు "అల" చరణం : సురపతులే ఐన, దైత్యులే ఐన అధికులే మరి హీనులే ఐన అవ్యాజ కరుణను జూపుటలో జగమందు స్వామికి, సరిజోడికనము "అల" "జో అచ్యుతానంద! జోజో ముకుందా! లాలి పరమానంద, రామ గోవిందా! జోజో!"
5.
అలరించగ పల్లవి : అలరించగ, శ్రీ వేంకటపతిని అవతరించెను, మన అన్నమయ్యా "2" అ.ప : కరనాడున, అల విఠలుని సేవింప ఇల పురంధరుడు జనియించెను "అలరించగ" చరణం : విష్ణు తేజము ఘన అన్నమయ్యది పురంధరునిది మరి బ్రహ్మ తేజమే "2" వీరి కలయిక కలిగె జగతికానందమె ఆనందమే, పరమానందమే "అలరించగ" చరణం : ర్ణాటక, మణి మాణిక్యములు పురంధరుని విరచితములు, ఎనలేని కీర్తనలు "2" ఆంధ్ర దేశపు పసిడి పచ్చల హారములు "2" అన్నమయ్య కృతుల శ్రుంగారములు "అలరించగ" "2" చరణం : అన్నమయ్య పురంధరుని భావనలు ఎల్ల జగతికి నిండుదీవెనలు "2" ఇరు తేజములు ఇలను ఒక్కటైనవి "2" భక్తి మార్గము యిక సుళువైనది "అలరించగ"
6.
Alayam 05:41
ఆలయం శ్లోకం : "పరిత్రాణాయసాధూనాం, వినాశాయచ, దుష్కృతాం; ధర్మసంస్థాపనార్ధాయ, సంభవామియుగే, యుగే" పల్లవి : ఆలయం దేవాలయం ధర్మార్ద్ధ, కామమోక్ష,సాధనలకు ఇది నిలయం "2" అ.ప : అలదైవమే ధర్మ దేవతగ ఇలలోకొలువుండేదే ఆలయం "ఆలయం" చరణం : బృహ్మాండమునే ఉదరమున దాచిన ఆబృహ్మాండ నాయకుని, నిత్యనివాసము "2" బృహ్మతత్వమును బోధించే బృహ్మాత్మకునీ బృహ్మాండ వాసము "ఆలయం" చరణం : ముల్లోకములను ముమ్మూర్తుల యేకము చేసే ముచ్చటైన ఆదైవనివాసము "2" ముజ్జగములకూ మూల రూపమగు ముకుందునీ ముఖ్యనివాసము "ఆలయం" చరణం : పరమ పవిత్రత, శుచీ శుభృతకు నెలవైవున్నది, ఇలలోని ఆ దైవనివాసము "2" మనసారజని, ముదమారగని, మధురాను భూతిని పొందునులే! మనము "ఆలయం"
7.
అంబా, జగదంబా పల్లవి : అంబా, జగదంబా అ.ప : ఆపదలు బాపేటి, ఆర్తపాలిని అంబా, జగదంబా, దుష్టుల పాలిటి భద్రకాళి "అంబా" చరణం : సరసస్వర రాగమయీ సర్వలోక వినుతమయీ "2" సత్యలోక జన పాలిని సుమధుర సంభాషిణి అంబా, జగదంబా "అంబా" "2" చరణం : ఇహలోభ నాశినీ ఈప్సితార్ధ ప్రదాయిని "2" అమృతవర్షిణి నీవు అమృతాంశ సంభూతిని అంబా, జగదంబా, "అంబా" "2" చరణం : అష్టదిక్కులు పాలించే పరమేశ్వరి, పరమపావని "2" దుష్ట సంహారిణి, దురితవిమోచని నీవు అంబా, జగదంబా "అంబా" "2"
8.
అంబరమందిన పల్లవి : అంబరమందిన అంబుజనాభుడే మా, డెందము నిండిన, దామోదరుడే "2" చరణం : అంతరంగముల, అచ్యుతుడే అందరిమనసుల ఆనందుడే "2" సుందరవదనుడే, సూర్య తేజుడే "2" మా అండదండగ ఉండేవాడు గోవిందుడే "అంబర" చరణం : అద్భుత, ఆనంద నందనుడే నందనానంద పరమాత్ముడే "2" నీలాంబరుడటనే! నీలాలకేశవుడే నీలలోచనుడే, నీలాసమేత గోవిందుడూ "అంబర"
9.
Ambavuneeve 04:34
అంబవు నీవె శ్లోకం : నమస్తే, శుద్ధ సేవ్యాని, ఆర్యే, మందార వాసినీ కుమారీ, కామినీ, కపాలీ కపిలే, కృష్ణ పింగళే భద్రకాళీ, నమస్తుభ్యం, కోటదుర్గా, "నమోస్తుతే" అంబా, శరణం, జగదంబా "2" పల్లవి : అంబవు నీవె, జగదంబవు నీవె జగములనేలే, జననివి నీవే అంబా, శరణం, జగదంబా! "2" చరణం : భరతాది మునివరులు, నిను బూజింపగ ఆనందమనముల వచ్చిరి తల్లీ! జలజాక్షి! నీ, మహిమ వర్ణింప తరమా! నీవే, మాతల్లి, దాక్షాయణీ! నవ మల్లెలు, చంప, కలువలు, సంపెంగ పూలు తెచ్చి నిన్ను, బూజింతు, ముదమార, మణిద్వీపమునందు, కొలువుండు మాతల్లి! వరములీయగ రావె! శ్రీచక్రవాసినీ అంబా, శరణం, జగదంబా, "2" చరణం : వినినంత, నీపాద మంజీరనాదములు దనుజుల గుండెల ఘీంకారధ్వనులు నవదుర్గవై నీవు, అసురసంహారము జేసి, లోకములు పాలింతువే, తల్లీ సద్గుణముల రాశి, శివవామభాగమున నెలవుండినావు, శివరమణివై నీవు నీ సేవయె మాకు, సౌభాగ్యమే తల్లీ! అభీష్టసిద్ధివి, మా కల్పవల్లివి అంబా, శరణం, జగదంబా "అంబవు" "2"
10.
Anandam 03:38
ఆనందం పల్లవి : ఆనందం, జగదానందం సహస్ర దీపం, సంధ్యాసమయం [2] చరణం : ఉభయ దేవేరీ సహితుండై కొలువు దీరెను, వేంకట రమణుడు [2] సహస్ర ప్రభల, కాంతి వెలుగులో [2] వెలిగేనూ, చిన్మయ రూపుడు [ఆనందం] చరణం : అజ్ఞానమను దివ్వెలలో సుజ్ఞానమనే తైలము నింపి [2] వెలుగు దివ్వెలు, ప్రోలెను ఆత్మలు [2] కాంతులీను, శ్రీ కాంతుని జూడగ [ఆనందం] చరణం : ముగ్ధ మోహనుడు, శ్రీవేంకటేశుడు ఓర జూపుల, మురిపించె సతుల [2] మరిపించె అలుకలు, ముత్యపు నగవుల [2] శోభిల్లె, జగమూయల కాగా [ఆనందం]
11.
Ananthamagu 03:56
అనంతమగు పల్లవి : అనంతమగు ఈ అనంతుడు అనంతమునకే అనంతము "2" చరణం : అనంత నీలాకాశ మందున ఆద్యంతమును, ఆతడే చరియించును అనంతనామముల, అనంతబాహువుల "2" అనాధ నాధుడు, అనాది దేవుడు "అనంత" చరణం : యోగి బృందముల పరమ యోగిగ యోగులమదిలో, ఆతడే వశియించును యోగుల కైనను, భోగుల కైననూ "2" జపియించిన నామము, వశుడగును సర్వము "అనంత"
12.
అందాలరాముడు పల్లవి : అందాలరాముడు, నీల మేఘ శ్యాముడు అసమాన శీలుడు, మాఅయోధ్యా రాముడు [2] చరణం : తండ్రి మాటకై, కానల కేగినాడు అతడు, అన్నదమ్ముల ప్రేమకు, ఆదర్శమైనాడు [2] ఇనకులమున జనియించిన, ఏకపత్నీవ్రతుడీతడు [2] సతిని గౌరవించి, మనకుసాక్షి భూతుడైనాడు [అందాల] చరణం : యాగములను కాచి, వేదభూమి చేసెను సాధుపుంగవుల గాచి, రక్కసులను దునిమెను [2] వైకుంఠ పతియె గాక, ఇంకెవ్వరాతడు [2] హృదిలోన సిరినినిలిపి, ఇలదైవమైనాడు [అందాల]
13.
Anthayuneeve 05:51
అంతయు నీవె పల్లవి : అంతయునీవె, జగమంతయునీవె నీకరుణ బడయగ, నోచనైతినే "2" చరణం : ధన, మోహములందు, జిక్కితి నేను "2" మదమాత్సర్యముల మునిగితి నేను అంధకారమునే, వెలుగను కొంటిని "2" అంధుడనైతినే,నిను కానక, "నే"అంతయు" "2" చరణం : ఆహారనియమములు, పాటించనైతిని "2" బంధనములనువీడని, బంధమను కొంటిని "2" బంధముక్తుడను, కానైతిని నేను, "2" కడకు నాబ్రతుకే బరువాయెను "అంతయు" "2" చరణం : ముకుందుడే పరమగతియని నమ్మితి "2" నీ పదములను ఎన్నడు వీడను (తండ్రీ) "2" పదరజమున నే రేణువైనను జాలు, "2" పంకజనాభా! ఓ దీనజనాభా "అంతయు" “2”
14.
Athmaku 04:31
ఆత్మకు అంతము లేదన్నా పల్లవి : ఆత్మకుఎన్నడు అంతము లేదన్నా "2" ఈఆత్మకు ఎన్నడు అంతము లేదన్నా! అ.ప : ఎన్నడు మలినము కానే కాదన్నా "ఆత్మకు" చరణం : "మనమను" అంటుయె, అంటదు రోరన్నా "మనదను" జాడ్యమె, పట్టదు రోరన్నా "2" ఏబంధముల చిక్కక, ఆనందపడునన్నా జంజ్యాటముల వలలో, చిక్కదు ఓరన్నా"ఆత్మకు" చరణం : జీవము వుంటే రారాజువురన్నా అది లేకుంటే, నీవెవరోరన్నా జగన్నాధుని చరణాల జేరుర ఓరన్నా జగన్నాయకుని ఆనతి గైకొనరోరన్నా "ఆత్మకు" చరణం : చిదానందముతొ మెలగుమురోరన్నా చిక్కులలో నువు పడకుర, ఓరన్నా ఆత్మానందము, నీహక్కురన్న ఆత్మకుసాక్ష్యము అక్కర లేదన్నా "ఆత్మకు"
15.
అటునిటునంతయు పల్లవి : అటునిటునంతయు, వెదకి చూచితి యంతవెదకిన, నినుకాననైతినే [2] చరణం : ఇంతలోన, నేనెంత యోచించి, నాసొంతమని, అనుకొంటినిన్నే [2] అంతయు వెదకితి, నేనెంత అనుచితుడ [2] అంతయునిండిన, అంతర్యామివె [అటునిటు] చరణం : ప్రాతఃసమయాన ,కొలువు దీరితివని మేల్గాంచి, నీకొరకే, ఆతురపడితి [2] నలుదిశలా వెదకి, వేసారితినే నేర్చితి,నీవే సర్వవ్యాపివని [అటునిటు] చరణం : అఖిల జీవుల, పోషకుడ వీవని నేనను, నీవను వర్ణమె వలదని [2] సకల లోకముల పాలకుడ వీవని [2] తెలిసి, ననునేమలచుకొంటిని [అటునిటు]
16.
బహు జటిలమగు జీవన యాత్రలో పల్లవి : బహు జటిలమగు ఈ జీవన యాత్రలో బంధ మోచనుడు, చుక్కాని తానేగా "2" అ.ప : జాగరూకులై జనులంతా మసలుకొన్న మరి ఎరుగక, మాయాజాలములో చిక్కెదరు ఈ మాయాజాలములో చిక్కెదరు "బహు" చరణం : తేనియ పలుకులు, పలుకుచునే తెప్పక్రింద నీరువలె చల్లగ చేరు "2" ఘనుల నుండి కాపాడు ఘనుడవు "2" నీవేగా తండ్రీ! మా విభుడవు "బహు" "2" చరణం : అదె! జూడరాతడె మహిమాన్వితుడు కాలాంతకులను అంతము జేయు "2" తలచిన వారికి తరగని దైవము "2" తలదన్ను వారికిని, తలమానికము "బహు"
17.
భావము బాహ్యము పల్లవి : భావము, బాహ్యము, అన్నియును, నీవే! హరీ! నాభావమున మెరసిన, భాగ్యమునీవె మరీ! "2" చరణం : అరుదైన స్వామివి,అంతర్యామివి "2" హరియే నిజమని, నిత్యమని ఆనతిచ్చెను, నా అంతరాత్మ మురిసెనామది, మధుసూదనుని గొలువగ "భావము" చరణం : పలుభావములలొ నిలచితివి నీవుకదా! సకలాభీష్టమునెరవేర్తు సర్వావస్తల, సర్వకాలమ్ముల కొలువగు దైవము, ఇలలోన శ్రీహరి ఒక్కడే, శ్రీ హరి ఒక్కడే! "భావము"
18.
భవతాపహరణము పల్లవి : భవతాపహరణము, నీపాదకమలము "2" గోశాలలో నీనామకరణము "భవ" చరణం : జగన్నాయకుని, తన జఠరమున మోసి ముక్తి బడసినది, దేవకీ దేవి "2" ముద్దులకృష్ణుని ముద్దుముచ్చటల పాలించి "2" మదిన మురిసినది, యశోదమ్మ "భవ" చరణం : దైత్యుల, మర్ధింప, నంద గోకులమున పసిబాలునిగా, రూపు దాల్చినావు "2" అల్లరికృష్ణునిగా, వలువలను దాచితివి "2" వైరాగ్య యోగము నీవు తెలిపితివి "భవ"
19.
Bhayamelaa 03:49
భయమేల పల్లవి : భయమేల! ఇక భయమేల అభయ హస్తుడే వుండగా "2" అ.ప : ఆదియు, అంతము అతడే కాదా భయమేలనె మనసా! "భయ" చరణం : భారమేల! నీ చెంతన బంధ విముక్తుడు వుండగ ఆధారమేల! మరి భూతభావనుడు, నీతోడువుండగ "2" యోచనేలనే మనసా! యుగపురుషుడు వుండగ సంకోచమేలనే మనసా! సంకర్షుణుడుండగ "భయ" చరణం : పరదైవమేల మనసా! హరి వెన్నంటే వుండగా పరమొసగు వరదుడీతడు, పురుషోత్తముడీతడు "2" పురుషార్థమతడు మనసా! అర్థము తానవునుగ పరమపురుషుడు మనసా! మన పరమే తానుగ "భయ"
20.
Bhuvanaika 04:28
భువనైక జననీ పల్లవి : భువనైక జననీ, ఆనందవల్లీ అమృతహృదయిని, అఖిలాంతరంగిణి "2" చరణం : ఇందువదనే, ఈశ్వర రమణే ఉన్నతశోభినే, ఉద్ధండమోక్షిణే "2" ఉత్పన్నకారిణే, విజయప్రదాయినే ఋద్రరూపిణే, ఋద్రాంబికే "భువ" చరణం : ఏకాంబరేశ్వరీ, శాకంబరీ అంతర్యామినే, ఐశ్వర్యదాయినే పారాయణప్రీతే, ఓంకారనిలయే ఆద్యంతరూపిణే, ఆధారనిలయే "భువ" చరణం : సురాసురవినుతే, శుభచరణే సర్వాయుధకరే, సరసిజనయనే త్రైలోక్యపాలినే, త్రిమూర్తిరూపిణే గంధర్వపూజితే, గానప్రియవే "భువ"
21.
Bhuvinel 03:31
భువినేలే పల్లవి : భువినేలే నీ సుందరపదములు అవియేమాపాలి పరమపదములు [2] చరణం : శిష్టులపాలి ప్రియరక్షకుడవీవు నిశాచరుపాలిట కర్కోటకుడవీవు [2] హరినీవె ఆదిమధ్యాంత రహితుడవు సమస్తరూపముల మూలరూపుడవు [భువి] చరణం : రూపుదాల్చేవు గండర గండునిగ దుండగులను పిండిజేసేటివేళల [2] బ్రోతువు సరిరాని కరుణాలవాలా శరణుజొచ్చిన దీనులు నినుజేర [భువి]
22.
బ్రహ్మోత్సవం పల్లవి : బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం తిరు వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవం [బ్రహ్మో] చరణం : సాగరమధనమున గరళామృతము వెడల కంఠమునందు దాచె, గరళము హరుడు [2] కాపాడె లోకములు, ఆ సాంబశివుడె అశృనయనమ్ములా కొనియాడె లోకములు [బ్రహ్మో] చరణం : అమరులను జేసేటి, అమృతమ్మును సురలు, అసురులూ, కోరితిరీసమముగ [2] మూర్తులూ, మువ్వురు, పడిరి సందిగ్ధమున యుక్తి సహితంబుగ యోచించె శ్రీహరి [బ్రహ్మో] చరణం: హరిమారెను, మోహినిగ, సర్వాంగ సుందరిగ అసుర, సురలు యిరువురు, తీరిరీ బారులుగ [2] వలికించె మోహిని, వలపు వయ్యారములు మునిగెను, అసురులు, మోహ సంద్రముల [బ్రహ్మో] చరణం: అమృతము సురలకు, అసురులకు జలమును పంచె మోహిని, అంత అసురులను మరిపింప అవతరించునులె ఆ దేవదేవుండు జగములను గాపాడ దీనబాంధవుడూ [బ్రహ్మో]
23.
Chaduvulu 05:36
చదువులు మెండుగ పల్లవి : చదువులు మెండుగ ఎంత నేర్చినను చదువరిని చదువక సూన్యము సుమ్మీ "2" చరణం : అచంచలమగు అచ్యుతుని సేవలు మహిలోన బహు చదువులు సుమ్మీ "2" భువిపైన విద్యలు, ఎన్ని నేర్చినను "2" శ్రీపాలుని మదిలో నిలుపుము సుమ్మీ ఆ శ్రీపాలుని మదిలో నిలుపుము, సుమ్మీ "చదువులు" చరణం : ధరణిలోన లౌకిక విద్యలెన్నున్ననూ లోకోత్తమునీ కొలచుటే మిన్న "2" ధరణీ ధరునీ, ధరలోన కొలచిన "2" అవి కొలువు గాలేని విద్యలే సుమ్మీ "చదువులు" చరణం : ముంగిటి సన్నిధి, ముజ్జగపు పెన్నిధి నాలుకలపై తేనె లొలుకు ఆ పదము "2" చదువక నైననూ హరినామము "2" జాలువారిన చాలును,సుళువగును పరము "చదువులు"
24.
Chandanam 03:58
చందనం పూయ రారె పల్లవి : చందనం పూయ రారె,అమ్మలాలా! చలువ చందనం,పూయ రారె,అమ్మలాలా! "2" అ.ప : అందచందముల సుందరవదనకు "2" సుందరేశునీ పంకజనయనకు "చందనం" చరణం : కుంకుమ దిద్ద రారే కస్తూరీ కుంకుమ దిద్ద రారె, అమ్మలాలా! "2" ముగ్ధ మోహినికి, లోకపావనికి "2" నాగాభరణుని, వామభాగినికి "చందనం" చరణం : హారము లేయ రారె పచ్చల హారము లేయరారె, అమ్మలాలా! "2" పచ్చని పీతాంబర ధారిణికి "2" పసిడి సింహాసన పీఠినికిని "చందనం" చరణం : హారతు లీయ రారె కర్పూర హారతు లీయ రారె, అమ్మలాలా! "2" హాస్యముఖీ, హరి సోదరికి "2" జటాధరునీ హృదయేశ్వరికిని
25.
చిన్ని కృష్ణయ్యా పల్లవి : చిన్ని కృష్ణయ్యా, మా చిన్ని కృష్ణయ్యా గురువాయూరున, వెలసిన ముద్దు కృష్ణయ్యా [2] చరణం : ముద్దు లొలుకు నగుమోము, కస్తూరి తిలకముతొ కరమున నవనీతముతొ, అలరారిన కృష్ణయ్యా [2] మాత యశోదకు నీవు పదునాల్గు భువనములు జూపి తాపమునే బాపితివి, కృష్ణయ్యా [2] బాల్యమునందే, బల పరాక్రమమును జూపితివయ్యా, రక్కసుల నణంచి, [2] చరణం : వామన రూపమున, బలిదర్పమునణచితివి, ఆనందముచేకూర్చి, మము బ్రోచిన కృష్ణయ్యా [2] అవతారమేదైన, ఆంతర్యమొకటెయని లోకమునకు చాటితివి, శోకమునే బాపితివి [2] చిన్ని కన్నయ్యా! మా బాల కన్నయ్యా వేగ రావయ్య! ఏతెంచరావయ్యా! [చిన్ని] [2]
26.
చిరు మంద హాసం పల్లవి : చిరుమందహాసం, శివ మందహాసం సుమదరహాసం, మధురాతిమధురం ఓంనమః శివాయ "4" చరణం : తామసములన్నియు,తొలగించుహాసం తామరపూవు వలె, వికసించుహాసం తాపత్రయాగ్నులు, శమియించుహాసం తాపసుల మనముల, వశియించుహాసం ప్రమధగణములను, శాసించుహాసం ప్రధమదేవునిగ, నుతులందుహాసం భువనేశ్వరి మదిన, నిలచిన హాసం భువనముల పాలించి,లాలించు హాసం ఓంనమః శివాయ "4" చరణం : సోముని శాపము, తొలగించు హాసం ముక్కంటి హాసం, మృదుమంద హాసం చక్కని స్వామికి, చక్కనైన హాసం లోకము లన్నియు, శివ హాస లాలసం కైలాసుని మోము, కళలొలుకు హాసం కామిత మోక్షములు, దీర్చును హాసం క్షేమ యోగములు, సిద్ధించు హాసం ఏకామ్రేశ్వరుని, ఏకైక హాసంఓంనమః శివాయ"చిరు""4"
27.
దేవదారుపండు పల్లవి : దేవదారు పండు, దానవాంతక పండు దివ్యమైన పండు, దిగ్గజమై నెలవుండు "దేవదారు" చరణం : సత్య లోకపు పండు సరళమైన పండు బేరసారములు లేని బలమైన పండు వెలల కొలువ లేని పండు వెచ్చించని పండు "దేవదారు" చరణం : మధుర ఫలముల పండు ముల్లోకముల నుండు "2" బుజ్జాయి ఈ పండు బంగారు పండు "ముకుందుడ"ను ఈ పండు మదిలోన స్థిరముండు "దేవదారు"
28.
దోబూచులాడేవురా పల్లవి : దోబూచులాడేవురా, కృష్ణయ్యా "2" బూచులు దునిమేటి అల్లరి కన్నయ్యా "దోబూచు" "2" చరణం : దాచిన వెన్నను దొంగిలించి నీ సాటి బాలురతొ భుజియించేవు "2" బృందావనమున నీ అడుగుల సవ్వడితొ "2" తరులు, విరులు ఆనంద నాట్యమే "దోబూచు" "2" చరణం : అన్నికాలముల, అఖిలధర్మములు నలుపటకు నీవు అవతరింతువు మేటి నీవయా! నీసాటి ఎవరయా! "2" ఇలనుమహిమలు చూపించ రావయా! "దోబూచు"
29.
Dhaga Dhaga 03:40
ధగ ధగ ధగ ఓంశంకరా! గరళ కంధరా! చంద్రశేఖరా! శివ, శివశంభో! "2" పల్లవి : ధగ ధగ,ధగ ధగ ధవళరూపమున మెరిసెను, నగమున నటరాజం ఢమఢమ, ఢమఢమ, ఢమరుకమ్మునూ, కరమున మ్రోగెను, ఢమఢమ, ఢం కైలాసనగమున శివతాండవము తకధిమి, తకధిమి, కదులగ పదములు "ధగ ధగ" ఓంశంకరా! గరళ కంధరా! చంద్రశేఖరా! శివశివశంభో "2" చరణం : హరిహర రూపమె, కైలాసనాధుడు జగతికి ఆతడె, ఆధారభూతుడు "2" స్థితి, లయములకు, మూలకారకుడు వరము లొసగుటలొ, బోళానాధుడు "2" పరవశాన శివ తాండవం ప్రమధ గణములకు పరవశం "ధగ ధగ" చరణం : పార్వతి మోము, నిండినవి నగవులు భువనైక విభుని ఆనాట్యలీలలు "2" సప్త సంద్రములు, ఉప్పొంగెనులే! కాశీనాధుని తాండవకేళికి "2" నటరాజు ఆడె నర్తనం ముల్లోకములకు పరవశం "ధగ ధగ" ఓం శంకరా! గరళ కంధరా! చంద్రశేఖరా! శివ శివ శంభో
30.
దూరపు కొండలు పల్లవి : దూరపుకొండలునునుపనితెలిసి,పరుగులుతీతువెఓమనసా!"2" చేరువనున్నహరినేమరచి, భ్రమయేనిజమనితలచేవు"దూరపు""2" చరణం : సంద్రమునందునీటి బిందువు ఏలనో తెలిసి ఈదుటకు, నువు సాహసించేవు, మనసా! అందని దానికి చేతులు జాచిన మనసా! "2" అందినది నువు, పొందలేవులే! మనసా "దూరపు" "2" చరణం : పొందినదంతయు నీ భాగ్యమని తలచు ఇక అందినదానిని అందముగా నువు మలచు అసాధ్యమైనను, మలచుట నీవంతు మనసా సరి చేయూతను ఒసగుట, తనవంతే మనసా! "దూరపు" చరణం : వర్షించు జలము పొలముల పారిన ఎండిన బీడులే పచ్చని పంటలవునులే మనసా! ధనము, కాలము, వ్యర్ధము సేయకె మనసా! నువు పలువురకు, మేలు సేయవే మనసా! "దూరపు"
31.
Ee Jagamu 07:17
ఈజగమువిష్ణుమయము పల్లవి :ఈజగము, విష్ణుమయము నిగమాగమము, శ్రీవిష్ణుపధము [ఈ జగము] అ.ప : అఖిలాండకోటి బ్రహ్మాండనాయకం [2][ఈజగము] చరణం భక్తాగ్రేసరుడు, మాఅన్నమయ్య చేసెను, సర్వముదైవాంకితమయ [2] కీర్తనలనే పూమాలగా జేసి [సంకీర్తలనే] శ్రీపతినలరించి, తరియించె నయ్యా [ఈజగము] చరణం : గోపన్నస్తుతియించె, రామన్నపదము చేపట్టె, ఆలయనిర్మాణము [2] పొందెను, గోపన్న కారాగారము రచియించె, శ్రీరామ సంకీర్తనలు [ఈజగము] చరణం : శ్రీ త్యాగరాయ, శ్రీరామదేవళా శ్రీరామ సేవయె, మాణిక్య, మణులాయె [2] సుఖదుఃఖములు, రాముని వరమనె ఆద్యంతములు, శ్రీరామమయమనె [ఈజగము] చరణం : పోతనవిరచితము, ఆంధ్రభాగవతం కృష్ణలీలామృతమును, లోకానికందించె కాసు, కనకములు, విడనాడెనయ్య ఇహమోహములకు, అతీతుడాయెను [ఈజగము]
32.
Elalona 05:02
ఇలలోన పల్లవి : ఇలలోన, స్వర్గ, సుఖములు ఎదురైన మదిలోన విడువక, నిన్ను నమ్మితి "2" అ.ప : ముజ్జగమ్ములఏలిక, నీవంటునమ్మితిదేవరా "2" నిన్నేనానెర నమ్మితి, హరీ "ఇలలోన" చరణం : మోక్షమును కోర, కాంక్షయె లేదు ముమ్మారు, నీ నామమె నమ్మితి భవపాశమ్ములు, నన్ను, మరి, పెనవేసిన నీదరినిజేరుట, గతియని నేనమ్మితి "ఇలలోన" చరణం : పలుకుటే ఎరుగని, మూగ జీవులు నిరతము నిన్నే మనమున ధ్యానించును మాటలను, బింకమును, నేర్చిన వాడను నిన్నేల, స్మరియింపగ, మరచెద నేను "ఇలలోన"
33.
ఎందుకో నా మనసు పల్లవి : ఎందుకో నా మనసు, ఎదురు సూస్తున్నాది ఎల్లలేలేనిసామి, ఎదురుగ వత్తాడని "2" హైలెస్సో, హైలెస్సా "ఎందుకో" "2" చరణం : సెట్టు, సేమలు అన్నీ, ఎదురు తెన్నులు కాసే సేతితో నా సామి, తాకగ మురిసేను "2" నోరులేని జీవులన్నీ, కళ్ళుఇల్లు సేసుకొని "2" సామిరాక కోసమే, ఎదురు సూత్తున్నవి హైలెస్సో, హైలెస్సా "ఎందుకో" "2" చరణం : ఏటిలోని సేపలన్ని, నీరుగారి పోయినవి నీరాక కోసమై, సిక్కవు వలలోన "2" కొండలన్నీ, నీ రాకకై బండ బారి పోయినవి "2" నీ రూపు దాల్చుటకూ, నీ సేవ సేయ హైలెస్సో, హైలెస్సా "ఎందుకో" "2" చరణం : మణిసై పుట్టినాను, నీ సేవ కోసమే నిన్నేల మరిసేనూ, నీ కై మసలేను "2" నాసామి, నీకేమి, బదులుగ యిచ్చేను నామనసు నీకెపుడో, నైవేద్దె మాయెను హైలెస్సో,"2"
34.
Esumantha 03:25
ఇసుమంత పల్లవి : ఇసుమంత తలచిన, ఎంతటి భాగ్యము ఇంతటి దైవము, ఎంతైనను, కనలేము "2" అ.ప. : అంతట తానైన, ఆదిబ్రహ్మ రూపము కొంత తలచినను, అందించును మరిఘనము"ఇసుమంత" చరణం: ఎంత వెదికిన, కానగ దుర్లభమైనను వెదకిన తావుల వెదకితి "2" తెలుసుకొంటిని, జగతియంతయు వ్యాపించినవిభుని "2" నగధరుడేయని, గోవిందుడేయని "ఇసుమంత" చరణం: "సుంత" యును లేడను వారి దర్పముల నంతయు, జగమంత నిండె, జగన్నాధుడు "2" "ఎంతో" అయిన హరిని, ఇంతయని, వర్ణింప సాధ్యమా! "2" సిరివరుడే యని, శ్రీ శ్రీనివాసుడని "ఇసుమంత"
35.
Gaali Neeru 03:50
గాలి నీరు ఆకాశము పల్లవి : గాలి, నీరు, ఆకాశము పొందుట కందరి కవకాశము "2" అ.ప : పరమాత్మ సృష్టియే, ఈ జగతి, మనమంతయు, కొలచుటయేకదా! అందరికి ఆలంబనము "గాలి" చరణం : పరము లేక పరతత్వమును కనలేము పరమాత్ముడు లేక మరి, మనము మనలేము "2" పరము, మనమను బేధమె కనబోము "2" ఉన్నది నీలోనె, పరమాత్మనివాసము "గాలి" చరణం : భగవంతుని కానక అంతయు శూన్యము ఆ శూన్యము నందుననే కొలువాయెను, దైవము "2" నీ మనసే నీకు నిజమగు సాక్ష్యము "2" నిండెను నీలోనె అనంత ఆ దైవము "గాలి"
36.
గగనము కావల పల్లవి : గగనము కావల కొలువాయె, దైవము గగనము కాదులే! ఆతని కరుణ బడయగ "2" చరణం: ప్రధమ పురుషుడు, ఆదిదేవుడు జగముల కాయగ, ఇలకు దిగివచ్చును "2" వరదుడుగా తాను అభయమిచ్చును "2" గెలుచును తాను, ఈ సకల భువనములు "గగనము" చరణం : ఆర్తుల బాధలు తను భరించును అభయ ప్రదాతగ మనలను గాచును ఆతని కరుణ గురిసిన జాలును "2" స్వర్గతుల్యమేగా! ఈభువనమెల్లను "గగనము"
37.
గంగంగణపతిం పల్లవి : గం గం గణపతిం, గజాననం గణపతిం "2" గం గం గణపతిం, వినాయకం గణపతిం "2" చరణం : మూషిక వాహనమెక్కి, లోకాలు దిరిగేవు ఇక్కట్లు కడతేర్చి, కోరికలు దీర్చేవు చవితిదినమునాడు ఉండ్రాళ్ళను భుజి యించి కొండంత ఫలములను,అందింతువయ్యా "గం" గణపతి పప్పా, గణపతి పప్పా, గణపతి పప్పా మోరియా! "4" చరణం : ఏకదంతా! నిను పలువిధముల తలతుమయా! పార్వతి తనయా! మమ్ము గాపాడవయా! పసిమనసుల కోర్కెలను, నెరవేర్చవయా! వారి చదువు సంధ్యలందు నిలువుమయా! జ్ఞాన, విజ్ఞానమను, దీపము వెలిగించవయా అజ్ఞానమనే తిమిరము పారద్రోలి కావుమయా! లక్ష్యములొ, నీవు లక్షణుడవై విజయ భేరి, మ్రోగించగ రావయా! "2" గణపతి పప్పా, గణపతి పప్పా, గణపతి పప్పా మోరియా! "గంగం" "4" చరణం : "యద్భావం తద్భవతని" గొలుతమయా! జిష్ణువైన, విష్ణువైన నీవెనయా! ముల్లోకపు ఏకదైవము నీవెనయా! తొలిపూజలు గైకొందువు రావయా! నీ"నిమజ్జనము"లోని పరమార్ధము దెలిపితివి "భక్తిమునక" కల్మషమును, కడిగివేయునంటివి సజ్జన సాంగత్యము మేలంటివి వారిని ఎన్నడు వీడొద్దంటివి "2" గణపతి పప్పా, గణపతి పప్పా, గణపతి పప్పా మోరియా! "గంగం" "4"
38.
Garalamu 02:45
గరళము పల్లవి : గరళము, కంఠము నందున, దాచిన నాధుడు, నీలకంఠుడు లోకములెల్లను కాపాడంగ, శోకము బాపెను, హరుడు "2" చరణం : ముల్లోకములకు రక్షకుడు ముజ్జగములకు పాలకుడు "2" జగతి క్షేమమే పరమావధిగా జనులకు ఆతడె ఆదిదేవుడు శంభో శంకరా! హర హర మహదేవా! "గరళము""2" చరణం : సనాతనుడు మా శంకరుడు అనాధనాధుడు ఈశ్వరుడు "2" శివశంకరుడు, సుమదరహాసుడు భూతనాధుడు, భూతాత్మకుడు శంభోశంకరా! హర హర మహదేవా! "గరళము""2"
39.
Ghana Ghana 03:55
ఘణ ఘణ ఘణ పల్లవి : ఘణ, ఘణ, ఘణ ఘణ ఘణ, ఘణ అందియ రవములు గల గల గల, గల, గల గల గాజుల కరములు "2" కదలి రావమ్మా! మా బంగారు తల్లి మమ్మేలగ రావమ్మాఈజగమేలుతల్లి "ఘణ" "2" చరణం : విజయుడు తపమును చేసెను యిచ్చట పాశుపతమునే పొందెనట, ఇచ్చట విజయవాడ పురమున వెలిసావట విజయము చేకూర్చే, చల్లని మా తల్లివట కనకదుర్గవుగ కనక ధారలను కురిపించే కాత్యాయనీ! ముగురమ్మలకు మూలరూపిణివి ముచ్చట గొలిపే ముగ్ధ మోహినీ "ఘణ" అమ్మా! " చరణం : కామేశ్వరి, కామాక్షివి నీవట కాశిలొవెలసిన ఆ విశాలక్షి నీవట కాశ్మీరపు మహాలక్ష్మి నీవట మధురలోవెలసిన ఆ మీనాక్షివి నీవట దుష్టుల నణచెడి భద్రకాళీ సజ్జనుల పాలిటి జగజ్జనని ఆత్మరూపిణి, ఆదిశక్తి వెలసిన ఆజన్మాంతర మోక్షప్రాప్తినొసగుమా "ఘణ"
40.
గిరిజా రమణ పల్లవి : గిరిజా రమణ, సుందర చరన, హర ఓం నమః శివాయ సంకట హరణ, సన్నుత చరణ, శివ ఓం నమః శివాయ రూపం నమః శివాయ, పూజ్యం నమః శివాయ, పాదం నమః శివాయ, ధన్యం నమః శివాయ "గిరిజా" చరణం : దక్షప్రజాపతి దర్పము బాపిన, హర ఓం నమఃశివాయ వీరబధ్రునిగ సుయజ్ఞ నాశము చేసిన నమఃశివాయ; గమ్యం నమఃశివాయ, నాట్యం నమఃశివాయ, గానం నమఃశివాయ; నామం నమఃశివాయ, క్షీరమధనమున గరళము మ్రింగి హర ఓం నమఃశివాయ ముల్లోకములను కాచి, బ్రోచిన శివ ఓం నమఃశివాయ భావం నమఃశివాయ, భజనం నమఃశివాయ, స్తోత్రం నమఃశివాయ, శ్రావ్యం నమః శివాయ "గిరిజా" చరణం : శివతాండవమున లోకములన్నియు, హర ఓంనమఃశివాయ సత్యానందమె పొందెను, దేవర! శివ ఓం నమఃశివాయ ధమరుక నమః శివాయ, ప్రమధం నమఃశివాయ అమరం నమః శివాయ, అజేయం నమఃశివాయ బ్రహ్మ, విష్ణు నుత, అసుర సేవిత హర ఓం నమఃశివాయ జగతి అంతయూ కైలాసమె కద! శివ ఓం నమఃశివాయ ధర్మం నమఃశివాయ, దైవం నమఃశివాయ సత్యం నమఃశివాయ, నిత్యం నమఃశివాయ "గిరిజా" చరణం : జగదంబను నీ అర్ధభాగమున హర ఓం నమఃశివాయ నిలిపి బంధమును చాటిన తండ్రీ, శివ ఓం నమఃశివాయ బంధం నమఃశివాయ, రమ్యం నమఃశివాయ భవ్యం నమఃశివాయ, భవితం, నమఃశివాయ సామవేదమున నిత్యము కొలువై, హర ఓం నమఃశివాయ వేద సారమై వెలుగొందేవు శివ ఓం నమఃశివాయ; నాదం నమఃశివాయ, వేదం నమఃశివాయ సర్వం నమఃశివాయ, శివోహం నమఃశివాయ, "గిరిజా"
41.
Gopaala 04:54
గోపాలా! శ్రీనందబాలా పల్లవి : గోపాలా! శ్రీ నంద బాలా అ.ప. : గోకులమున, మా గోపకిషోరా [గోపాలా] చరణం : వసుదేవ తనయా, వసుదైక హౄదయా నందన బాలా, నవనీత చోరా [2] బృందావనమున, మురళీ లోలా [2] కాళిందిలోనా, నర్తనహేలా [గోపాలా] చరణం : చిటికెన వ్రేలుపై, గోవర్ధనమును కురుసంగ్రామమున, విశ్వరూపమును [2] భువిజమనమ్మున, మృదు మోహనముతొ మురిపించే, శ్రీ మువ్వల బాలా [గోపాలా] [2] చరణం : భావము చేతనె, భవబంధములను వనమాలీ! నువు పారద్రోలుమా [2] ఇహపరమందున, నామము తోడనే [2] ముక్తి నొసంగుమా! శ్రీహరి, మోళీ [గోపాలా] [2]
42.
Govindude 04:37
గోవిందుడే గోపాలుడే పల్లవి : గోవిందుడే, గోవిందుడే ఈతడె, మాపాలి గోపాలుడే "2" అ.ప. : గోవులను కాచేటి గోవిందుడే హై "2" గోవర్ధనమును ఎత్తెనులే "గోవిందుడే" చరణం : బృందావనమున గోవిందుడే గానామృతముల గానలోలుడే "2' రాధాలోలుడె గోవిందుడే హై "2" మాబాధలనే త్రోలెనులే గోవిందుడే "గోవిందుడే" చరణం : ముద్దుల కృష్ణుడె గోవిందుడే ముత్యపు టుంగరముల నందబాలుడె "2" పరమాత్ముడు వాడె గోవిందుడె హై "2" పరముతానై వున్నాడు, గోపాలుడే "గోవిందుడే" చరణం : వెదురునందున గోవిందుడే మధుర రవళులు, మ్రోగించెనులే "2" వెతలను బాపును గోవిందుడే హై "2" వేదాంతసారము గోపాలుడే "గోవిందుడే"
43.
Halamunu 04:21
హలమును చేపట్టె పల్లవి : హలమును చేపట్టె నొక కవీంద్రుడు భోగములను నమ్మె నొక కవీంద్రుడు "2" చరణం : భగవన్నామమె, తన జీవనమని భగవంతుని సేవే, పరమావధనుకొని "2" భగవంతుడే తన సర్వస్వమనుకొని భవసాగరము ఈదుట, సుళువనెను, పోతనా! పోతనా! "హలము” చరణం : రాజభొగములే తుదిలేని సుఖమని మహీపాలుర, మన్ననలె, మనుగడ అనుకొని "2" ముందు చూపేలేక, భోగాలు శాశ్వతమని మునిగెను శ్రీనాధుడు, ధనసంపదలెల్ల వృధా ఆయెను, వృధా ఆయెను,"హలము" చరణం : తలచగనేర్వము, ధరణీ పాలురు కరుణింతురెపుడో, కరవాలము దూతురు ఎపుడో "2" మహీధరుని కరుణయె, ఇల నిక్కము, నిత్యము ఆతని బడయుటయే నిజమైన మార్గము నిత్యము, సత్యము "హలము"
44.
Hari Govinda 04:23
హరి గోవింద పల్లవి : హరి గోవింద, గోవింద భజ గోవింద, గోవింద [2] చరణం : వనరాజైన, మృగ రాజైనను ఆకలి గొనినంత, కోరునాహారము [2] మరి, మానవులు, "తృష్ణ" యను నాకలి కలుగ, లోకమునే భుజియింతురే! [హరి] [2] చరణం : కాలకూటమగు విషమును జిమ్మెడు కాలనాగైనను, గళమున మెరిసెనే [2] మనుజులేల మెలుగక శాంతము [2] క్రోధమను విషమును గ్రక్కెదరుగా! [హరి] చరణం : కొండను జుట్టిన, కొండ చిలువైనను దరి చేరిన దానినె, భుజియించును [2] మరి మనుజుడేల, అందినదొదలును [2] అందని దానికై యత్నించును [హరి]
45.
Hari Neeve 05:41
హరి నీవే పల్లవి : హరి, నీవే, మా ఇహపర దైవము హరియే, మాకూ, కైవల్య పదము [2] అ.ప : యెరుగుము, యెరుగుము, ఓ మనసా! [హరి] చరణం : హరి, నీగతియే సులభసాధ్యము [2] హరి, నీతలపే ఇలవైకుంఠము [2] హరియే మాపాలి అభయ హస్తము యెరుగుము, యెరుగుము, ఓ మనసా! [హరి] [2] చరణం : సురనుతుడే, మాకున్న దైవము ఆతడు, జగతికి అపూర్వ భావము పాలించును, ఇలను పీతాంబరుడే [2] ఎరుగుము, ఎరుగుము, ఓమనసా [హరి] [2] చరణం : హరి, నీచరణములు, భవతాపహరణం హరి నామమే మాకు, పుణ్య శ్రవణం పరంధాముడే, మా మూలధనము [2] ఎరుగుము, ఎరుగుము, ఓ మనసా! [హరి] [2]
46.
హరి స్మరణయే పల్లవి : హరి స్మరణయే, భువిన పరమౌషదము హరి చరణములను, గొలువుము నిరతము [హరి] చరణం : జనియించినది మొదలు, సుఖదుఃఖములను జీవన డోలలో, ఊయలూగితి [2] నింగి కెగరితి, నేలను జేరితి తలచితి నన్నియు, ప్రసాదములుగ [హరి] చరణం : ఇహ కర్మంబుల గడచె కాలము వ్యర్ధ భాషణల, నిష్ఫలము సమయము [2] దౌడుగుర్రములా జేసితి పయనము ఇటునటు బరుగులు, జీవిత మంతయు [హరి] చరణం : నీవు సమీపింప, అవసాన దశలందు మరలించు మదిని, మధుసూదుని యెడ [2] ఘడియైనను జాలు, పొందుటకు నీవు దివ్య చరణములు, ద్వారములు దెరువగ [హరి] చరణం : సర్వవ్యాపకుడు, "శ్రీ హరి" తలపే జేర్చును నిన్నుముక్తిగమ్యము [2] నరుని జన్మము, ఉత్తమమని తలచి కొలచుట సుఖము, పొందుము పరము [హరి]
47.
Harinaamamu 06:40
హరినామము పల్లవి : హరినామము శ్రీహరి నామము అ.ప : పావననామము కడు రమ్యము [2] చరణం : పలుకుము నామము సుళువగును మార్గము [2] పలుకు పలుకులయందు హరినామమును నింపు [హరి] చరణం : చక్కని నామము చుక్కాని యీ నామము [2] చుక్కెదురైనను నిను చక్కగ దరిజేర్చును [హరి] చరణం : తరుణోపాయము యీ శుభనామము అరుణారుణవేళల భజియింపు నామము [2] కరుణరసములు నిండిన నామము పరమపదమునకు యిది మన కుడిభుజము [హరి] చరణం : అతియును గతియును యీ పుణ్యనామము ఆత్మానందము పొందును మనము [2] ఆద్యంతములైన శ్రీహరి నామము తన్మయత్వమున మనసు పులకితము [హరి]
48.
హరి నిను గొలచుట పల్లవి : హరి, నిను గొలచుట, ఎంతటి భాగ్యమో! హరి, నిను తలచుట, ఎంతటి ఫలమో! "2" చరణం : నిను గొలువని కరము, కరమౌనా! నిను తలచని మనసు, మనసౌనా! "2" నీ భావనలేని భావమదేలా! భవతాపహరా! దురితదూరా! "హరి" చరణం : నీ యోచనలేని తలపేలా! నీ బంధములేని తనువేలా! నినువిడి నేనిక, మనియెద, నది యేల! నిను గాంచని కనుల వెలుగది యేల! నా జన్మ నీ సేవకు, అంకితము "హరి"
49.
Himagirula 06:04
హిమగిరులభాసించు, కాత్యాయనీ పల్లవి : హిమగిరుల భాసించు, కాత్యాయనీ ధవళకాంతుల వెలుగు శ్రీ చక్రిణీ "2" అ.ప : సత్యసంధాయినీ, శ్రీరూపిణీ "2" సౌందర్యలహరివే, శుభకారిణీ "హిమ" చరణం : అర్చనల సేవింతు, శ్రీ శాంభవీ సంతసము నిండగా, శివరూపిణీ "2" శివరాణి అయిన శ్రీ పరమేశ్వరీ ఎల్లలోకములు ఏలేటి శుభ కీర్తివే "హిమ" చరణం : పాటలీ కుసుమముల, వనవాసినీ హరి సోదరీ, మా హిమ సుందరీ "2" కామేశ్వరీ శ్రీ శివకామినీ "2" జనమోదిని, మా శుభ యోగినీ "హిమ" చరణం : దైత్య శమని, మా శివశంకరీ మంగళములివె, శ్రీ భువనేశ్వరీ "2" నీదు చూపులె మాకు క్షమదాయకం "2" తల్లి, నీకిదె మానీరాజనం "హిమ"
50.
Jagamerigina 03:57
జగమెరిగిన వానికి పల్లవి : జగ మెరిగినవానికి, జంధ్యమెందుకు, హరినితలచుటకు, నీకుయోచనెందుకు [2] అ.ప : యోజనదూరము, నీకుయందుకని [2] నీమానసమున నిలుపుము, ఆతనిని [జగమెరిగిన] చరణం : చదువూసంపదలు, లోకములేలుటకు [2] భక్తిసంపద, భాగవతోత్తముని కొలచుటకు [2] అజ్ఞానతిమిరములు, పారద్రోలెడివాడు [2] సర్వేశ్వరుడొకడే, జగమేలు వాడు [2] [జగమెరిగిన] చరణం : ఘనకీర్తి కాములు, పదవులు యేలిననూ [2] పెదవిన, శ్రీహరి పదమొకటే చాలును [2] పదహారు కళల నాధుడు, పద్మనాభుడితడు [2] పదాంబుజముల రజ మొకటే చాలును [2] [జగమెరిగిన]
51.
జగము నిజము పల్లవి : జగము నిజము, జనులునిజము హరిని తలచగ నేల సంశయము! "2" చరణం : ఝరులునిజము, తరులు నిజము కరుణాసాగరుని, కరుణ నిజము "2" మాయ నిజము, మంత్రమునిజము "2" మహీధరుని మహిమలు నిజము నిజము, నిజము "జగము" చరణం : విరులు నిజము, తావినిజము నిజము విరితావులలో మకరందము "2" హృదయలయలో, హరియే తావిగ "2" తరియించు జనుల, మనుగడయె నిజము నిజము, నిజము "జగము"
52.
జగములనేలే! తల్లివి పల్లవి : జగముల నేలే, తల్లివి నీవు శివ సతి, పరాశక్తివి "2" చరణం : అన్నింటను, నీ అభినవరూపము మిన్నంటిన, నీ కరుణలాలసము వెన్నుతట్టి, దారిచూపించు విధము సన్మార్గాన, నడిపించు ఘనము అలరారేవు, అఖిల జగమ్ములు అఖిలరూపమ్ముల, ఆదిశక్తిగ ఆయురారోగ్య, ఐశ్వర్యదాయిని అఖిల చరపు కార్య కారిణి "జగ" చరణం : శంకర విరచిత సౌందర్యలహరీ జగదోద్ధారిణి, జగన్నాయకీ శంకర ప్రియ రమణి శాంకరీ కైంకర్యముతో సేవింతుమే విద్యా ప్రదాయిని, వాగ్దేవివి నీవు వాగ్భూషణి నీవె, వేదమయివి నీవె వనజభవుని ప్రియపత్నివి వరములిచ్చెడి వరదాయిని "జగ"
53.
జనన జీవన పల్లవి : జనన జీవన చక్రమందున "2" ఇరుసు తానై ఇలను ఏలును అ.ప : యుగముల దైవము, శ్రీ హరి తప్ప వేరొక దైవము లేనేలేడు "జనన" "2" చరణం : జీవన నౌకను ఈదుటలో పలు రేఇంబవళ్ళు గడచినవి "2" మనసు మరల్పు సమయమున "2" వయసుడుకు వేళలు, సమీపించినవి స్వామీ! నిను జేరు వేళలు దగ్గరైనను "2" ఇహలోక వాంఛల,మునిగితినయ, నేను"జనన" చరణం : కూపస్థ మండూక చందమున సంసార కూపమున మునిగితిని "2" భువిపైన జన్మ లెన్నున్న "2" మానుషజన్మము పరమోత్తమము, స్వామీ! మరుజన్మ కైనను, నీ స్మరణయె తప్ప "2" అన్యము ఎరుగక, యత్నింతునయా! "జనన"
54.
Jayathu 04:10
జయతు, జయతు పల్లవి : జయతు, జయతు, ఓభాగవతోత్తమా! జయము నీకు ఓ పురుష పుంగవా! "2" చరణం : తిరుగాడెను, తిరు వేంకటరమణుడు తిరు మాడవీధుల మోహినీరూపమున రామచిలుకను, కరమున ధరియించెను మన అసువులు, ఎన్నడెగురునో ఎరుగములే! మనలోన ప్రాణము ఉన్నంతవరకు తగినంత సత్కర్మలు చేయవలె అనుజ్ఞ నొసగెను, ఆ అంతర్యామి మరువకుమా! ఓ మానఓత్తమా! "జయతు" చరణం : చేతనగునంత చేయి సహాయము తిలకించు నగవులు, వారి నగుమోముల "2" దీవించు నిన్ను ఎల్ల వేళలా అన్నిటికన్న అవి ఎంతయో మిన్న "2" జేర్చును ఆ దైవసన్నిధి "జయతు"
55.
Jeevathma 05:24
జీవాత్మ పరమాత్మ పల్లవి : జీవాత్మ, పరమాత్మ ఒకటేరన్నా! ఇక నేనను, నీవను బేధమె లేదు, లేదన్నా "2" అ.ప : పరమాత్మను నీవు, నీలోన కనరన్నా పరతత్వమంటూ ఎచటనో లేదన్నా ఓ లాలా, ఓ లాలా, ఓ లాలా...."జీవాత్మ” "2" చరణం : నీ సాటివారితో సఖ్యతగా నువు మనుమన్నా నీ తోటివారినీ ప్రేమించుటయె, మరి మిన్నన్న సాటి జీవులపై కనికరము కనరన్నా! నీ పాటికినీవేవుండుట, ఇకమరితగదన్నా"జీవాత్మ" "2" చరణం : అన్నెం,పున్నెము,ఎరుగని ఈ తరువులపైజాలి చూపన్నా! నీ ఆత్మకు సాక్షివి నీవేరా! ఓరన్నా ఇది ఎరుగన్నా నీ ఆత్మ శోధనయె పరమాత్మను జేర్చన్నా అదియేసుఖము, ఇలలోఇతరముయికలేదన్నా"జీవాత్మ"
56.
కలిమి లేములు పల్లవి : కలిమిలేములు, సమమని భావించి [2] ఇలనుమనిన, ఆ నరుడే, మహనీయుడు [2] చరణం : పురుషాధముడవని, భావించిన నిన్నే [2] పురుషాగ్రశ్రేణివని, పొగడుదురె! జనులు [2] కలిమిలేములను, త్రాసున నిలబెట్టి [2] కొలచి, కొలచి, వేధింతురయ్యా నిన్నే! ఈ నరులు, యిల నరులు [కలిమి] చరణం : కలిమియందునను, కలదంటు సుఖము తలచిన వారంతా, మరలెదరు, దిక్కును [2] కలిమిలేములు, దేవుని చేతలని [2] తెలియనివారె చేసెదరయ్యా మాయను ఈనరులు, యిల నరులు [కలిమి] చరణం : కలిమిలేములే, వెలుగుతిమిరముల [2] జోడియని, నమ్మే, మనుజులె నిక్కము [2] లేమియందుననూ, తనవారిగ తలచుకొని [2] మెలగిన వారే, జగమున నిజమగు బంధము [కలిమి] చరణం : ఇహమున, నిజకలిమి పద్మనాభుడని [2] ఎరుగనివారేలే, కడలేని లేమియని ఎరిగిన ఆనాడు, పరమగును, యిహము [2] ఎరుగనినాడు, కనలేము, యిల పరము [కలిమి]
57.
Kantimi 03:48
కంటిమి నీదు సుందరరూపము పల్లవి : కంటిమి, నీదు సుందరరూపము మా వెన్నంటి యున్న, మంగళరూపము "2" చరణం: అలమేలు మంగాపురమున, వరముగనిలచి అలవోకగ, నీ అద్భుతరూపమునే గాంచి కామితార్ధములు తీర్చును మా కల్పవల్లి "2" కనక వర్షములు, కురిపించును, మాచల్లనితల్లి "కంటిమి" చరణం: కొండలరాయుని, కోమలాంగిని, మా తల్లి మా అండగనుండేటి, అమ్మలగన్నమ్మ క్రీగంటి చూపుల, వేంకటనాధుని ప్రియసతి శ్రీపతి అలుకలు దీర్తువు చక్కని మా తల్లి చక్కదనముతో, మృదుభాషణముల, నగవుల తల్లి "కంటిమి"
58.
కరుణాంబుధివై పల్లవి : కరుణాంబుధివై, సిరులను గురిపించే "2" శ్రీ పతి నీవే గావా! అ.ప : పరలోకమును జేర్చు పదములు "2" మాపాలి పెన్నిధియేగా "కరుణాం" చరణం : పరాత్పరా! నీవు సుర నుతులకు అందజాలవు, ఆది దైవమా "2" మాపాలిటి దైవము నీవే "2" నీ పాదసుమములు, ఇహపర సుఖములు "కరుణాం" చరణం : సత్య సాధకుల, నీవు, నాలుక కొనలందు ప్రీతినొనర్పగ పలికెదవే "2" సత్యాన్వేషకుల ప్రియవే "2" తొలివేకువగా, మా అండదండగా "కరుణాం"
59.
కరుణాంతరంగుని పల్లవి : కరుణాంతరంగుని, కను ధృక్కులె చాలు [2] అభయాంతరంగుని, అభయ హస్తమె చాలు [కరుణ] చరణం : హరి నిను గొలచిన, హరణములన్నియు [2] హరి! హరీ! యని పరుగిడవా! [2] బృందావనమాలి, ఆనందనందుని [2] నామభజనమె, దుర్జన భంగము [కరుణ] చరణం : ఆధారనిలయుని అమృత వాక్కులే [2] ఇల గీతామృతము, గ్రోలగ మధురము [2] శబరి ఒసగిన, ఫలములు భుజియించి [2] "ఆత్మశుద్ధి" భక్తి ఆభరణ మంటివి [కరుణ]
60.
కొలచిన వారికి పల్లవి : కొలచిన వారికి, కొలచిన తీరుల కొలువని వారికి, కొలచేటి రీతుల "2" అ.ప : నీ దివ్యకరుణల, నడయాడే వేంకటరమణా, వేదనారాయణా "కొలచిన" చరణం : కొండంత ఫలము, కొండంత బలము కోనేటి రాయుడె, మా కొండంత దైవము "2" యేడు కొండలలో, కొలువైవున్నాడు "2" కొండల రాయుడె, మా కులదైవము వేంకటరమణా, వేదనారాయణా "కొలచిన" "2 చరణం : అన్నింటను, నీఅండయే వున్నఇలనిది లేదను, చింతయే కనము "2" కైవల్య పదమునకు, కారణభూతుడు "2" మూర్తీభవించిన, కారుణ్యజలనిథి వేంకటరమణా, వేదనారాయణా "కొలచిన" "2" చరణం : ప్రాభాతవేళల, నీ పదాంబుజముల సేవయె మాకు ఇహపర సౌఖ్యము "2" కలియుగమందున ప్రత్యక్షదైవమై "2" వరములు కురిపించే, వరదాయకా వేంకట రమణా, వేదనారాయణా "కొలచిన" "2"
61.
కొలువగ నితడే పల్లవి : కొలువగ నితడే, కొండంత సిరియే తెలుపక రాని, వరదు డీతడే "2" చరణం : మహిలోన పెనుదైవ మితడే కలవరములు మాపు కలిమియు నితడే "2" నిక్కము ఈతడే, మహిమోదరుడే నిజమగు దైవము, దామోదరుడే "కొలువగ" చరణం : పలువురు ఈతని పలు నామమ్ముల స్తుతియించిననూ ఏకతత్వమే "2" ఏకము తానుగ, అనేక తత్వముల "2" గోచరించును, పరతత్వము తానై "కొలువగ"
62.
కొమ్మల అంచుల పల్లవి : కొమ్మల అంచుల, మెరిసే పూతావి వలె "2" మా కన్నుల నిండుగ వేంకటేశుడు మా ఆత్మల ఆత్మ జ్యొతి వేంకటేశుడు "కొమ్మల" చరణం : అమ్మలాల, అలకొండరాయుడే మా అండ, దండని, తలచేరే "2" కొమ్మల పూవుల, ఎల్ల తావుల "2" మనసెల్ల నిండెడు, మహీధరుడు, నగధరుడు "కొమ్మల" చరణం : ఎల్లలోకములు యేలెడి రాయుడు ఈ నల్లని ఱేడుని, కొలువరే! "2" చెంతన, చింతలు బాపెడి వాడట "2" సుంతైనను, మనకు చింతలు, యిక యేల! "కొమ్మల"
63.
కొండచిలువైన పల్లవి : కొండ చిలువైన గాని, చిన్నచీమైన గాని రమ్యుని ప్రసాదమే, తరచి కానగ "కొండ" "2" చరణం : బహు ఘన వృక్షమైన చిన్నినాటైననూ "2" తరచి చూచినది, శ్రీ హరి ప్రసాదమే "2" పర్వత రాజమైన, భువిపై, రజమైన "2" యోచించగా నదియు, సిరివరుని ప్రసాదమే "కొండ" చరణం : కొదమ సింగమైన, చిన్ని చేపైనను తర్కించగ నదియు, సర్వేశ్వర ప్రసాదమే సర్వ సృష్టి కంతయు నిశ్చల మనస్కుడే "2" వైకుంఠ నిలయుడే నిజమైన దైవము "కొండ"
64.
Krishna Hare 03:57
కృష్ణ హరే పల్లవి : కృష్ణ హరే! జయ కృష్ణ హరే! "2" గోపవనితల నిశ్చలభక్తికి, కృష్ణహరే! జయకృష్ణహరే "2" చరణం : బృందావనమున, గోపాలబాలునితో వేణుగాన రసడోలల, గోపవనితలు, ఆడిపాడిరి "నల్లనయ్య" అను పిలుపే నలు దిక్కుల మారు మ్రోగె, పల్లె పల్లెల, రేపల్లెల "2" పున్నాగవనమున, పున్నమి వెన్నెలలో గోపెమ్మ గన్నుల, నంద గోపాలుడే "కృష్ణ హరే" చరణం : అల గోపెమ్మల, పాదధూళియే కడకు మేటి ఔషధమాయె, ద్వారకా విభునకు చిన్ని బాలుడాయె, కృష్ణుడు, ఆడి పాడెను గోపకాంతలంత గూడెను, పరవశించెను "2" మురిపించె నందుడు, వేణుగాన డోలల బృందావనాన సంబరాల అంబరమంటెనులే "కృష్ణ హరే"
65.
కృష్ణంవందే జగద్గురుం (భజన) పల్లవి : కృష్ణం వందే జగద్గురుం [2] కృష్ణ సేవనం, పాప భంజనం [కృష్ణం] [2] చరణం : నవనీత చోరం నారాయణం నంద బాలం నాభిన కమలం [కృష్ణం] [2] దేవకి తనయం దానవ అంతం కౄర భంజనం అక్రూర ప్రియం [కృష్ణం] [2] చరణం : త్రేతాయుగము రామ జననము రావణ హననము రామరాజ్యము [కృష్ణం] [2] కలియుగ దైవం శ్రీ శ్రీనివాసం కామితార్ధము సర్వం సఫలం [కృష్ణం] [2]
66.
Krishnam 04:07
కృష్ణం మధురం పల్లవి : కృష్ణం, మధురం, నీ జననం బాల కృష్ణం, సతతం నీ స్మరణం అ.ప : మధురా నగరిలో నీ జననం "2" అఖిల లోకములకు పరమానందం "కృష్ణం" చరణం : చెఱసాలలో జరిగెను జననం చెఱలు విడిపించు నీ చరణం "2" వ్రేపల్లెలో నీ పాలనము "2" గోకులమూ, పరమ పావనము "కృష్ణం" చరణం : దుష్టుల పాశము, నీ తీక్షణము శిష్టుల రక్షణయే లక్షణము "2" అష్ట దిక్కులలో ఎటు వీక్షించిన "2" కటాక్షము నొసగే కైవల్యుడితడే "కృష్ణం"
67.
క్షీరాంబుధిలో క్షీరప్రియుండు పల్లవి : క్షీరాంబుధిలో, క్షీరప్రియుండు కొలువైయున్నాడు, స్వామిని చూడరొ జనులాలా [2] చరణం : చక్కదనముతోడ, చక్రధరియె వాడు చక్కనితల్లి ప్రియ చెంగల్వె వాడు [2] చక్కని, చిక్కని నగవుల ఱేడు చక్కనయ్యా! అని పొగడరే మీరు [2] చక్కనయ్యా! అని పొగడరే జనులాలా [క్షీరాంబుధి] చరణం : చెక్కిలి, చెక్కుల, తళుకు బెళుకు వాడు చుక్కానిగ మము నడిపించువాడు [2] చుక్కలనింగిన, చల్లని ఱేడు చల్లనయ్యా అని పిలువరే మీరు [2] చల్లనయ్యా అని పిలువరే జనులాలా [క్షీరాంబుధి] చరణం : రమకు విభుడె వాడు రమణీప్రియ వాడు రసాంబుధిలో ఓలలాడించువాడు [2] రసరమ్యముల గానలోలుడెవాడు రాధా లోలాయని పాడరె మీరు [2] రాధా లోలాయని పాడరె జనులాలా [క్షీరాంబుధి]
68.
Kulukula 05:05
కులుకుల కలికితో పల్లవి : కులుకుల కలికితో తెలుపగ రారే అల వేంకటపతి, అలుకలను దీర్పగ "2" అ.ప : పున్నాగవనమును కోరగ రారే "2" పన్నగ శయనుడు, చిరునగవులు చిలుకుటకు "కులుకుల" చరణం : అరవిరిసిన తామరలతో తెలుపగ రారే! అలుకలు దీర్పగ "2" కలువ కన్నుల అలివేణిని కోరరే "2" కన్నయ్యకన్నుల, మెరుపులునింపగ "కులుకుల" చరణం : జగమేలు తల్లి కినుకు దీర్పగ అల నీరజాక్షుని, బ్రతిమాలగ రారే కంజదళాయునుని, కోరగరారే "2" తన ప్రియ సతి రమణి అలుకనుదీర్పగ "కులుకుల" చరణం : శృంగార జూపులు, చిరునగవులు కలిసినవి కన్నుల అనురాగ మొలకలై సంధ్యా వీచికలు చల్లగ వీచే "2" పిల్లన గ్రోవిన అవి రాగము లాయెను "కులుకుల"
69.
లాలీ కృష్ణయ్యా పల్లవి : లాలీ, కృష్ణయ్యా, మురిపాలా, కృష్ణయ్యా [2] అ.ప : నీముగ్ధ మోహనముకని తరియింతు, రారా! కృష్ణయ్యా [లాలి] చరణం : కమలలోచనుడా! కమలాక్షి సుందరుడా! నీ కనుదోయికి, కాటుకను దిద్దేము [2] చీనాంబరము, కస్తూరి తిలకముతో కళలు, ఒలికించే,ముద్దులకన్నా,రావయ్యా [లాలి] "లాలీ, లాలీ, లాలీ, లాలీ" చరణం: గోపెమ్మలయిండ్ల, వెన్ననుదొంగిలించితివి బుంగమూతితో, మము మురిపించెదవు, నీవు [2] గోవర్ధనమే ఎత్తి, ఇంద్ర గర్వమును [2] అణచినావయ్యా, ముద్దులకిట్టా, రావయ్యా [లాలి] "లాలీ, లాలీ, లాలీ, లాలీ"

about

Sudhanva Sankirtanam is a Devotional Album written by Lakshmi Valli Devi Bijibilla. Music composed by Kanakesh Rathod. Recorded at 'S' rec.in Hyderabad, Telangana State, India. Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi. Publisher : Bijibilla Rama Rao : Presented by Bijibilla Foundation.

credits

released July 18, 2019

SudhanvaSankirtanam Web Site : www.sudhanvasankirtanam.com/index.html

Sudhanva Sankirtanam YOUTUBE Link :
www.youtube.com/channel/UC9s2iiOB2nacBxXub3DGdQQ

Sudhanva Sankirtanam Soundcloud Link :
soundcloud.com/lakshmi-valli-devi/sets/vishnu-sthuthi-1

license

all rights reserved

tags

about

Lakshmi Valli Devi Bijibilla Hyderabad, India

Lakshmi Valli Devi Bijibilla : Born on 18 February 1961. Parents Brahmasri Ravipati Bala Gurunadha Sarma and Smt. Thripura Sundari.Schooled at Madapati Hanumantha Rao Girls High School, Narayanaguda, Hyderabad, Telangana State, India. Married Sri Bijibilla Rama Rao in 1979 at Thirumala Hills with blessings of Lord Balaji. Blessed with three female children. Presented by Bijibilla Foundation. ... more

contact / help

Contact Lakshmi Valli Devi Bijibilla

Streaming and
Download help

Report this album or account

If you like Lakshmi Valli Devi Bijibilla, you may also like: